IND vs SL | అద్భుత బౌలింగ్‌తో శ్రీలంకను అలవోకగా చిత్తుచేసిన టీమ్ఇండియా రికార్డు స్థాయిలో ఎనిమిదోసారి ఆసియాకప్ ముద్దాడింది. హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ ఆరు వికెట్లతో సత్తాచాటితే.. హార్దిక్ పాండ్యా మూడు వికెట్లతో మురిపించాడు. అంతకుముందు ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే జస్ప్రీత్ బుమ్రా.. లంకకు భారీ షాక్ ఇచ్చాడు. ముగ్గురు పేసర్లు కలిసి 10 వికెట్లు ఖాతాలో వేసుకోవడంతో.. ఆతిథ్య శ్రీలంక 50 పరుగులకే ఆలౌట్ అయింది. సిరాజ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, కుల్దీప్కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి.
ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్ అనంతరం ఒక ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ ముగిసిన తర్వాత టీమ్ఇండియా ప్లేయర్స్ ఒక చోట నిలబడ్డారు. ఈ క్రమంలో అక్కడున్న టీమ్ఇండియా ఓపెనర్ ఇషాన్ కిషాన్ విరాట్ కోహ్లీ వాక్ ఎలా చేస్తాడో ఇమిటేట్ చేశాడు. దీంతో విరాట్ అది చూసి కౌంటర్‌గా ఇషాన్ కిషాన్ ఎలా నడుస్తాడో చేసి చూపించాడు. ఇది చూసి స్టేడియం అంతా నవ్వుకున్నారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral Video) మారింది. కోహ్లీ అభిమానులు కూడా ఆ వీడియోను ఇష్టపడుతూ కామెంట్లు చేస్తున్నారు.
Ishan Kishan mimics Virat Kohli’s walk. (Rohit Juglan).
Virat Kohli counters it later! pic.twitter.com/1UWc7aaNsP
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 17, 2023