MI vs RCB | 23 బంతుల్లోనే ఇషాన్ ఫిఫ్టీ.. 6 ఓవర్లకు ముంబై స్కోర్..?
MI vs RCB : భారీ ఛేదనలో ముంబై ఇండియన్స్(mumbai indians)కు అదిరే ఆరంభం లభించింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్(55), రోహిత్ శర్మ(15) బౌండరీల మోత మోగించారు. ఇషాన్ అయితే సిరాజ్, టాప్లే, ఆకాశ్ దీప్.. ఏ ఒక్కరినీ వదలకుండా ఉతికేశాడు.
MI vs RCB : భారీ ఛేదనలో ముంబై ఇండియన్స్(mumbai indians)కు అదిరే ఆరంభం లభించింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్(55), రోహిత్ శర్మ(15) బౌండరీల మోత మోగించారు. ఇషాన్ అయితే సిరాజ్, టాప్లే, ఆకాశ్ దీప్.. ఏ ఒక్కరినీ వదలకుండా ఉతికేశాడు. 23 బంతుల్లోనే ఇషాన్ 6 ఫోర్లు, 4 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతడి విధ్వంసంతో, ఆర్సీబీ ఫీల్డర్లు ప్రేక్షకుల పాత్ర వహించగా.. పవర్ ప్లేలో ముంబై స్కోర్ రాకెట్లా దూసుకెళ్లింది. 6 ఓవర్లకు ముంబై స్కోర్.. 72/0.
ముంబై ఇండియన్స్ స్పిన్నర్ సొంత మైదానంలో రాయల్ చాలెంజర్స్ బ్యాటర్లు శివాలూగిపోయారు. కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్(61), దినేశ్ కార్తిక్(53 నాటౌట్), రజత్ పాటిదార్(50)లు అర్ధ శతకాలతో కదం తొక్కారు. దాంతో, ఆర్సీబీ 8 వికెట్ల నష్టానికి 196 రన్స్ కొట్టింది. ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చెరిగానా.. మిగతా బౌలర్లకు ఈ ముగ్గురు చుక్కులు చూపించారు. ఒక దశలో 23కే రెండు వికెట్లు పడిన జట్టును డూప్లెసిస్, పాటిదార్ మెరుపు ఇన్నింగ్స్‌తో ఆదుకోగా.. చివర్లో కార్తిక్ ఉప్పెనలా విరుచుకుపడ్డాడు. ఆకాశ్ మద్ధాల్ను ఉతికారేస్తూ బౌండరీల వర్షం కురిపించాడు. దాంతో, ఆర్సీబీ నిర్ణీతవ ఓవర్లలో స్కోర్ చేయగలిగింది. ముంబై బౌలర్లలో బుమ్రా ఐదు వికెట్లు పడగొట్టాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

