RCB vs SRH : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్ మొదటి మ్యాచ్‌లో ఇషాన్ కిషన్(80) రెచ్చిపోయాడు. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో విరుచుకుపడిన అతడు జట్టుకు స్కోర్నందించాడు. ఆర్సీబీ పేసర్ జాకబ్ డఫ్ఫీ(3-22) ధాటికి ఆరంభంలోనే కష్టాల్లో పడిన సన్‌రైజర్స్‌ను హెన్రిచ్ క్లాసెన్(31)తో ఆదుకున్న ఇషాన్ సిక్సర్లతో హోరెత్తించాడు. సాల్ట్ మెరుపు ఫీల్డింగ్‌తో అతడు ఔటయ్యాక ఆఖర్లో అనికేత్ వర్మ(43) దంచేశాడు. 19వ ఓవర్లో ఈ చిచ్చరపిడుగు 17 పరుగులు పిండుకోగా.. హైదరాబాద్ 201 పరుగులు చేయగలిగింది.
పంతొమ్మిదో సీజన్ ఆరంభ పోరులో టాస్ ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆదిలో తడబడినా కోలుకుది. టాపార్డర్ విఫలమైన చోట కె ఇషాన్ కిషన్(80 38 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. హెన్రిచ్ క్లాసెన్(31) జతగా 97 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పిన ఇషాన్ భారీ స్కోర్‌కు బాటలు వేశాడు. అనంతరం అనికేత్ వర్మ(43 18 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు) నేనున్నాగా అంటూ తనమార్క్ విధ్వంసంతో ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఇషాన్, అనికేత్ మెరుపులతో ఆరెంజ్ ఆర్మీ ప్రత్యర్ధికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
Led by example 👏pic.twitter.com/nskUck2JuL
— SunRisers Hyderabad (@SunRisers) March 28, 2026
జాకబ్ డఫ్పీ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో సిక్సర్‌తో అలరించిన అభిషేక్ శర్మ(7) దూకుడు పెంచే క్రమంలో టైమింగ్ కుదరక జాకబ్ డఫ్ఫీ(3-22) ఓవర్లో వెనుదిరిగాడు. చివరి బంతికి సిక్సర్ కొట్టే ప్రయత్నంలో ట్రావిస్ హెడ్(11) బౌండరీ లైన్ వద్ద సాల్ట్ చేతికి చిక్కాడు. దాంతో.. రెండు కీలక వికెట్లు కోల్పోయింది. అనంతరం కెప్టెన్ ఇషాన్ కిషన్(23 నాటౌట్) జతగా క్రీజులో నిలుస్తాడనుకున్న నితీశ్ రెడ్డి(1) సైతం తేలికగావికెట్ ఇచ్చేశాడు. డఫ్ఫీ బౌలింగ్‌లోనే పేలవ షాట్ ఆడి చేతికి చిక్కాడు. మూడు వికెట్లు పడిన వేళ అభినందన్ సింగ్ ఓవర్లో రెచ్చిపోయిన ఇషాన్ వరుసగా సిక్స్, ఫోర్, సిక్స్ బాదడంతో పవర్ ప్లేలో 3 వికెట్ల నష్టానికి ఎస్ఆర్హెచ్ 49 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్(31), ఇషాన్‌లు దూకుడు పెంచి 28 బంతుల్లోనే 50 రన్స్ జోడించి ఆదుకున్నారు.
The FIRE spirit never faded 💪 pic.twitter.com/PPIZeIa6d7
— SunRisers Hyderabad (@SunRisers) March 28, 2026
ఎడాపెడా బౌండరీలతో వీరిద్దరు విరుచుకుపడగా 13వ ఓవర్లోనే స్కోర్ 120 దాటింది. అయితే.. షెపర్డ్ ఓవర్లో బౌండరీ లైన్ వద్ద సాల్ట్ స్టన్నింగ్ క్యాచ్‌తో క్లాసెన్ పెవిలియన్ చరగా.. సిక్సర్ బాదిన సలీల్ అరోరా(9)ను సుయాశ్ వెనక్కి పంపాడు. సాల్ట్ పరుగెడుతూ ఒంటిచేత్తో క్యాచ్ అందుకోవడంతో ఇషాన్ ఔటవ్వగా.. 155 వద్ద ఆరో వికెట్ పడింది.
When class meets elegance 🤝✨ pic.twitter.com/4XVvB9SImO
— SunRisers Hyderabad (@SunRisers) March 28, 2026
ప్రధాన ఆటగాళ్లు ఔటనా ఒత్తిడికి లోనవ్వని అనికేత్ వర్మ(43) క్లాస్ ఆటతో చెలరేగాడు. భువనేశ్వర్, కృనాల్ ఓవర్లో సొగసైన బౌండరీలతో అలరించాడు. షెపర్డ్ వేసిన 18వ ఓవర్లో స్ట్రెయిట్‌గా 100 మీటర్ల సిక్సర్ బాదిన ఈ చిచ్చరపిడుగు.. తర్వాతి బంతికి ఫోర్, సిక్సర్ రాబట్టాడు. అదే ఓవర్లో అతడు ఔట్కాగా చివరి ఓవర్లో 9 పరుగులు రావడంతో హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది.