T20 Series | భారత్‌తో పొట్టి సిరీస్.. ఐర్లాండ్, ఇంగ్లండ్ స్క్వాడ్ ప్రకటన..!
T20 Series : వన్డే సిరీస్‌లో అఫ్గనిస్థాన్‌ను వైట్‌వాస్ చేసిన భారత జట్టుతో ఇంగ్లండ్, ఐర్లాండ్ అమీతుమీకి సిద్ధమవుతున్నాయి. స్వదేశంలో టీమిండియాతో పొట్టి సిరీస్ సమీపిస్తున్నందున ఇరు దేశాలు బోర్డులు సోమవారం తమ స్క్వాడ్‌ను ప్రకటించాయి.
T20 Series : వన్డే సిరీస్‌లో అఫ్గనిస్థాన్‌ను వైట్‌వాస్ చేసిన భారత జట్టుతో ఇంగ్లండ్, ఐర్లాండ్ అమీతుమీకి సిద్ధమవుతున్నాయి. స్వదేశంలో టీమిండియాతో పొట్టి సిరీస్ సమీపిస్తున్నందున ఇరు దేశాలు బోర్డులు సోమవారం తమ స్క్వాడ్‌ను ప్రకటించాయి. హ్యారీ బ్రూక్ సారథిగా ఇంగ్లండ్ వేల్స్ బోర్డు 17 మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేయగా.. ఐర్లాండ్ క్రికెట్ మాత్రం 14 మందినే తీసుకుంది. రెండు టీ20ల సిరీస్‌కు ఐరిష్ జట్టుకు లొర్కాన్ టక్నర్ కెప్టెన్‌గా వ్యవరహించనున్నాడు.
స్వదేశంలో అఫ్గనిస్థాన్‌తో ఏకైక టెస్టు, వన్డే సిరీస్ గెలుచుకున్న భారత జట్టు విదేశీ పర్యటనలతో బిజీ కానుంది. జూన్ 26న ఐర్లాండ్‌తో.. ఆపై జూలై 1 నుంచి ఇంగండ్ జట్టుతో టీ20 సిరీస్‌లో తలపడనుంది టీమిండియా. ఈ నేపథ్యంలో ఐర్లాండ్ క్రికెట్ సోమవారం లొర్కాన్ టక్నర్ కెప్టెన్‌గా 14 మందితో నిండిన స్క్వాడ్‌ను ఎంపిక చేసింది.
Lorcan Tucker has been named Ireland’s new T20I captain as they announce the squad for the India series 🆕 pic.twitter.com/FDP8AeQFpg
— Cricinfo (@ESPNcricinfo) June 22, 2026
ఇంగ్లండ్ వేల్స్ బోర్డు సైతం హ్యారీ బ్రూక్ సారథిగా 17 మందిని తీసుకుంది. ఓపెనర్ బెన్ డకెట్పై వేటు పడగా.. సకీబ్ మహమూద్, జోర్డన్ కాక్స్, బేకర్ తిరిగి స్క్వాడ్‌లోకి రాగా.. జేమ్స్ కొలెస్ తొలిసారి టీ20లకు ఎంపికయ్యాడు. భారత్, ఐర్లాండ్ మధ్య జూన్ 26 శుక్రవారం తొలి టీ20 జరుగనుంది. ఆదివారం జూన్ 28న రెండో మ్యాచ్ ఉంటుంది. ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది టీమిండియా. జూలై 1 నుంచి ఇరుజట్ల మధ్య పొట్టి సంగ్రామం మొదలవ్వనుంది. అనంతరం వన్డే సిరీస్ కూడా ఉండనుంది.
ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలో శ్రేయస్ అయ్యర్ సారథిగా, తిలక్ వర్మ డిప్యూటీగా వ్యహరించనుండగా.. యువకెరటం వైభవ్ సూర్యవంశీ, ఐపీఎల్ స్టార్ పేసర్ ప్రిన్స్ యాదవ్‌లకు స్క్వాడ్‌లో చోటు దక్కింది.
◾ James Coles called up for the first time
◾ Cox, Baker and Mahmood return pic.twitter.com/QNV9F8tKfs— Cricinfo (@ESPNcricinfo) June 22, 2026
ఇంగ్లండ్ టీ20 స్క్వాడ్ : జోస్ బట్లర్, ఫిల్ సాల్ట్, టామ్ బ్యాంటన్, జాకబ్ బెథెల్ హ్యారీ బ్రూక్(కెప్టెన్), సామ్ కరన్, విల్ జాక్స్, లియాం డాసన్, జోష్ టంగ్, ల్యూక్ వుడ్, సకీబ్ మహమూద్, రెహాన్ అహ్మద్, జేమ్స్ కొలెస్, ఆదిల్ రషీద్, జోఫ్రా ఆర్చర్, సోనీ బేకర్, జోర్డన్ కాక్స్,
ఐర్లాండ్ టీ20 స్క్వాడ్ : లొర్కాన్ టక్నర్(కెప్టెన్), స్టీఫెన్ డొహెనీ, జై మూండ్రా, రాస్ అడైర్, మాథ్యూ హంప్రెస్, హ్యారీ టెక్టర్, బెన్ కాలిట్జ్, గవిన్ హొయే, టిమ్ టెక్టర్, గరెత్ డెలానీ, మాథ్యూ హొలార్డ్, రూబెన్ విల్సన్, జార్జ్ డాక్రెల్, లియాం మెక్‌కార్తీ.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

