సోమవారం 25 జనవరి 2021
Sports - Dec 24, 2020 , 16:07:26

ఐపీఎల్‌లో 10 టీమ్స్‌.. బీసీసీఐ ఆమోదం

ఐపీఎల్‌లో 10 టీమ్స్‌.. బీసీసీఐ ఆమోదం

అహ్మ‌దాబాద్‌: ఐపీఎల్‌లో 2022 నుంచి ప‌ది టీమ్స్ ఆడ‌నున్నాయి. ఈ మేర‌కు వార్షిక స‌ర్వ‌స‌భ్య స‌మావేశంలో బీసీసీఐ దీనికి ఆమోదం తెలిపింది. ఐపీఎల్‌లో కొత్త జ‌ట్లు అనేది బీసీసీఐ ఎజెండాలో ప్ర‌ధాన అంశంగా ఉంది. ఈ రెండు కొత్త జ‌ట్లు ఏవి అనేది ఇంకా తేల‌లేదు. అయితే ఈ టీమ్స్‌ను కొనుగోలు చేయ‌డానికి గౌత‌మ్ అదానీ, సంజీవ్ గోయెంకాలాంటి దిగ్గ‌జ వ్యాపార‌స్తులు ఆస‌క్తి చూపుతున్నారు. నిజానికి వ‌చ్చే సీజ‌న్ నుంచే ఐపీఎల్‌లో ప‌ది జ‌ట్లు ఉంటాయ‌ని భావించినా.. దానికి త‌గినంత స‌మ‌యం లేదని బోర్డు స‌భ్యులు అభిప్రాయ‌ప‌డ్డారు. 

94 మ్యాచ్‌లు.. రెండున్న‌ర నెల‌లు?

అయితే ప్ర‌స్తుతం 8 జ‌ట్లు ఉన్న ఐపీఎల్‌లో 60 మ్యాచ్‌లు ఆడుతున్నారు. ఇదే చాలా పెద్ద షెడ్యూల్ అనుకుంటే.. ఇక నుంచి 10 టీమ్స్ అంటే మ్యాచ్‌ల సంఖ్య ఏకంగా 94కు పెర‌గ‌నుంది. దీంతో టోర్నీ రెండున్న‌ర నెల‌ల పాటు సాగాల్సి ఉంటుంది. అదే జ‌రిగితే అంత‌ర్జాతీయ షెడ్యూల్‌పై తీవ్ర ప్ర‌భావం ప‌డుతుంది. అంతేకాకుండా ఇన్ని మ్యాచ్‌ల పాటు అంద‌రు విదేశీ ప్లేయ‌ర్స్ అందుబాటులో ఉంటారా లేదా అన్న‌ది కూడా అనుమాన‌మే.

మ‌రికొన్ని కీల‌క నిర్ణ‌యాలు

- 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చాల‌న్న ఇంటర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ నిర్ణ‌యానికి బీసీసీఐ మ‌ద్ద‌తు ఇస్తుంది. దీనిపై ఇండియ‌న్ ఒలింపిక్ అసోసియేష‌న్‌తో సంప్ర‌దించి తుది నిర్ణ‌యం తీసుకుంటాం.

- ఇండియాలో టీ20, వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌లు నిర్వ‌హించ‌డం కోసం ప‌న్ను మిన‌హాయింపు కోరాల‌ని నిర్ణ‌యం. దీనికోసం బోర్డు సెక్ర‌ట‌రీ, కోశాధికారి ప్ర‌భుత్వంతో మాట్లాడ‌నున్నారు.


ఇవి కూడా చ‌ద‌వండి

ఆ కొత్త ర‌కం క‌రోనా వైర‌స్ అలా బ‌య‌ట‌ప‌డింది!

త్వ‌ర‌ప‌డండి.. కార్ల‌పై భారీ డిస్కౌంట్లు

క‌రోనా వ‌ల్ల వాయిదా ప‌డిన స్పోర్ట్స్ ఈవెంట్స్ ఏవి? న‌ష్టం ఎంత‌?

‘కొవాగ్జిన్‌’తో ఏడాది వరకు యాంటీబాడీలు : భారత్‌ బయోటెక్‌


logo