IPL | బిగ్ బ్రేకింగ్.. ఐపీఎల్ ‘సమీక్ష’ సమావేశం వాయిదా..!
IPL : ప్రతి ఐపీఎల్ సీజన్ ముందు సమీక్ష సమావేశం (IPL Review Meeting) నిర్వహించే భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఈసారి మాత్రం వాయిదా వేసింది. అదే సమయంలో కొత్త తేదీని మాత్రం వెల్లడించలేదు.
IPL : ప్రతి ఐపీఎల్ సీజన్ ముందు ‘సమీక్ష’ సమావేశం (IPL Review Meeting) నిర్వహించే భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఈసారి మాత్రం వాయిదా వేసింది. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 15 గురువారం ఐపీఎల్ ఫ్రాంచైజీ యజమానులు, మీడియా హక్కులు కలిగిన సంస్థలు, ఆయా రాష్ట్రాల క్రికెట్ సంఘాల ప్రతినిధులు ఈ మీటింగ్ జరగాలి. కానీ, అనుకోకుండా ఆరోజు సమీక్ష సమావేశం లేదని బీసీసీఐ కబురు పంపింది. అయితే.. వాయిదాకు కారణాలు ఏంటీ? అనేది తెలియాల్సి ఉంది.
ఐపీఎల్ 20వ సీజన్‌కు ముందు జరగాల్సిన సమీక్ష సమావేశం వాయిదా పడింది. ఈ విషయాన్ని పది జట్ల యజమానులకు, మీడియా రైట్స్ కలిగిన జియోస్టార్, స్టార్ స్పోర్ట్స్ సంస్థలకు, రాష్ట్ర క్రికెట్ సంఘాలకు బీసీసీఐ, ఐపీఎల్ పాలకమండలి తెలియజేశాయి. ‘షెడ్యూల్ ప్రకారం ఆక్టోబర్ 15 గురువారం సాయంత్రం 6 గంటలకు ఈ రివ్యూ మీటింగ్ ఉండాలి. కానీ ఈ రోజుల సమావేశం వాయిదా వేస్తున్నాం’ అని బీసీసీఐ నుంచి ఫ్రాంచైజీ యజమానులకు సందేశం వెళ్లింది. అదే సమయంలో కొత్త తేదీని కూడా వెల్లడించలేదు. దాంతో, అసలు ఏం జరిగి ఉంటుంది? అనేది ఆసక్తి రేపుతోంది.
JUST IN – The BCCI has postponed the joint review meeting on the IPL that was scheduled to be held in Mumbai on October 15.
No new date has been communicated. https://t.co/WE2KsB5Xxk
— Cricbuzz (@cricbuzz) October 13, 2026
క్రిక్‌బజ్ కథనం ప్రకారం.. ఈ రివ్యూ మీటింగ్ వాయిదాకు ఓ కారణముంది. ఇటీవల జపాన్‌లోని ఐచీ నగోయలో ముగిసిన ఆసియా క్రీడల్లో (Asian Games 2026) పతకాలతో మెరిసిన భారత బృందానికి ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) సన్మానం చేయనున్నారని సమాచారం. ‘అక్టోబర్ 15వ తేదీనే ఆసియా క్రీడల విజేతలకు ప్రధాని మోడీ సన్మానం చేయనున్నారు. ఢిల్లీలో జరుగనున్న ఈ సత్కార కార్యక్రమంలో ఆసియాడ్‌లో పతకాలు గెలిచిన క్రీడాకారులతో పాటు భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్టు సభ్యులు పాల్గొననున్నారు’ అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. సో.. ఒకట్రెండు రోజుల్లో సమీక్షకు కొత్త తేదీని బీసీసీఐ, ఐపీఎల్ పాలక మండలి ప్రకటించే అవకాశముంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IPL | బిగ్ బ్రేకింగ్.. ఐపీఎల్ ‘సమీక్ష’ సమావేశం వాయిదా..!
Indian Army | ఇండియన్ ఆర్మీకి అందిన 450 నాగాస్త్ర-1 ఆర్ డ్రోన్లు.. ఒకే దశలో అందించిన సంస్థ
Balmuri Venkat | కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ భూకబ్జాపై సీపీఎం నాయకుల ఆందోళన.. వీడియో
Yuvraj Singh | మొన్నటి వరకు మెంటర్.. ఇప్పుడు బ్యాటింగ్ కోచ్‌గా యువరాజ్..!
L Murugan | కేంద్ర మంత్రి పదవికి ఎల్ మురుగన్ రాజీనామా.. బీజేపీని తమిళనాడులో బలోపేతం చేసేందుకేనని ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

