Cameroon Green : ఐపీఎల్ వేలంలో రికార్డు ధర పలికిన కామెరూన్ గ్రీన్ (Cameroon Green) సొంతగడ్డపై చతికిలపడ్డాడు. రూ.25.20 కోట్లతో చరిత్ర సృష్టించిన ఈ పొడగరి ఆల్‌రౌండర్ అడిలైడ్ టెస్టు(Adelide Test)లో డకౌటయ్యాడు. టాపార్డర్ విఫలమైన తరుణంలో.. భారీ అంచనాల నడుమ క్రీజులోకి వచ్చిన రెండో బంతికే వికెట్ పారేసుకున్నాడు. ఆర్చర్ బౌలింగ్‌లో లెగ్ సైడ్ షాట్ ఆడిన గ్రీన్.. అక్కడే కాచుకొన్న కార్సే డైవింగ్ క్యాచ్ పట్టగా సున్నాకే వెనుదిరిగాడు.
స్వదేశంలో జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో కామెరూన్ గ్రీన్ వైఫల్యం కొనసాగుతోంది. ఐపీఎల్లో రికార్డు ధర పలికిన ఉత్సాహంతోనైనా గ్రీన్ పెద్ద ఇన్నింగ్స్ ఆడతాడనుకుంటే ఉసూరుమనిపించాడు. అడిలైట్ టెస్టులో మార్నస్ లబూషేన్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన ఈ ఆల్‌రౌండర్.. పేలవ షాట్ ఆడి.. కార్సే చేతికి చిక్కాడు.
Expensive Player in #iplauction2026, out for a duck 🦆! In ashes #Ashes #iplauction2026 #CameronGreen #Cricket26 pic.twitter.com/CkYxfsONlF
— Real Khattak (@FaizanUmer50457) December 17, 2025
దాంతో.. ‘ఏంటీ గ్రీన్.. ఐపీఎల్లో కోట్లు కొల్లగొట్టావ్.. దేశం తరుఫునా డకటైనావ్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. పరిమిత ఓవర్ల క్రికెట్లో హిట్టైన కామెరూన్ గ్రీన్ టెస్టుల్లో మాత్రం తేలిపోతున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్లో 35కు పైగా టెస్టులాడిన ఈ చిచ్చరపిడుగు బ్యాటింగ్ సగటు 33 మాత్రమే. ఇక బౌలింగ్ యావరేజ్ కూడా 36 ఉందంతే. అబుధాబీలో మంగళవారం ఆసక్తిగా జరిగిన వేలంలో గ్రీన్ అత్యధిక ధర పలికాడు. విధ్వంసక ఆటగాడైన ఈ కుర్రాడి కోసం కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ పోటీపడ్డాయి. చివరకు రూ.25.20 కోట్లకు కోల్‌కతా గ్రీన్‌ను దక్కించుకుంది.
Cameron Green failed to score run as he goes for duck 🦆 #Ashes #AUSvsENG #Possible11 pic.twitter.com/qh0YaXgish
— Possible11 (@Possible11team) December 17, 2025