Mitchell Starc | సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఆదివారం జరిగిన ఐపీఎల్-2025 వేలం సందర్భంగా ఆస్ట్రేలియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ రూ.11.75 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకున్నది. ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా స్టార్క్ 2024 వేలంలో రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. రికార్డు ధరకు కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ.24.75కోట్లకు కొనుగోలు చేసింది. ఆ సీజన్లో లీగ్ దశలో పేలవ ప్రదర్శన చేసిన స్టార్క్.. ఆ తర్వాత నాకౌట్ దశలో అద్భుత ప్రదర్శనతో జట్టును విజేతగా నిలిపాడు. ఇటీవల ఫాస్ట్ బౌలర్‌ను కేకేఆర్ రిలీజ్ చేసింది. వేలంలో రూ.2కోట్ల బేస్ ప్రైజ్‌తో స్టార్క్ వేలంలోకి ఎంట్రీ ఇచ్చాడు. మొదటి ముంబయి ఇండియన్స్ స్టార్ స్టార్ కోసం బిడ్‌ని ప్రారంభించింది. ఆ తర్వాత కేకేఆర్ బరిలోకి దిగడంతో రూ.6.25 కోట్లకు ధర చేరింది.
ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ సైతం పోటీ పడింది. కోల్‌కతాతో పోటీపడగా.. ధర రూ.10.25కోట్లకు చేరింది. ఆ తర్వాత కేకేఆర్ వెనక్కి తగ్గింది. అనూహ్యంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రేసులోకి వచ్చింది. దాంతో ధర రూ.11.50కోట్లకు చేరింది. ఢిల్లీ చివరకు రూ.11.75కోట్లుతో కొనుగోలు చేసింది. గతేడాదితో పోలిస్తే స్టార్క్ ధర రూ.13కోట్లు తగ్గింది. ఆస్ట్రేలియన్ పేసర్ తొమ్మిదేళ్ల తర్వాత గతేడాది ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. గత సీజన్లో 14 మ్యాచులలో 26.11 సగటుతో, 10.61 ఎకానమీతో 17 వికెట్ల పడగొట్టాడు. నాకౌట్ దశలో కేకేఆర్‌కు బౌలింగ్‌తో విజయాన్ని చేకూర్చాడు. క్వాలిఫైయర్-1, ఐపీఎల్ ఫైనల్లోనూ ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. క్వాలిఫయర్ 1లో స్టార్క్ నాలుగు ఓవర్లలో 3/34తో ఆకట్టుకున్నాడు. ఫైనల్లో మూడు ఓవర్లు వేసిన ఈ ఫాస్ట్ బౌలర్ 14 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. గత సీజన్లో కేకేఆర్‌ను విజేతగా నిలిపిన స్టార్క్ ఈ సారి కూడా.. ఢిల్లీ తరఫున అదే మ్యాజిక్‌ను చేస్తాడా? లేదా? వేచి చూడాల్సిందే.