IPL 2023: 200+ స్కోర్ చాలట్లే.. ఐపీఎల్లో రికార్డు
ఈ ఐపీఎల్ సీజన్లో ఇప్పటివరకు 200పైగా లక్ష్యాన్ని6సార్లు ఛేదించారు. ఐపీఎల్ మొత్తం మీద ఇప్పటివరకు ఏ సీజన్లో కూడా ఇది సాధ్యం కాలేదు. ఎక్కువ సార్లు 200కిపైగా స్కోర్లు నమోదైన సీజన్‌గా ఐపీఎల్ 2023 రికార్డు క్రియేట్ చేసింది.
IPL 2023: ఈ ఐపీఎల్ సీజన్లో ఇప్పటివరకు 200పైగా లక్ష్యాన్ని6సార్లు ఛేదించారు. ఐపీఎల్ మొత్తం మీద ఇప్పటివరకు ఏ సీజన్లో కూడా ఇది సాధ్యం కాలేదు. ఎక్కువ సార్లు 200కిపైగా స్కోర్లు నమోదైన సీజన్‌గా ఐపీఎల్ 2023 రికార్డు క్రియేట్ చేసింది. బ్యాటర్లు రాణిస్తుండటం, ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల అత్యధిక స్కోర్లు నమోదవుతున్నాయి. ఇప్పటికి ఏయే టీంలు 200కి పైగా లక్ష్యాన్ని ఛేదించాయో చూద్దాం..
GT vs KKR: ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత ఓవర్లో 4 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది. రషీద్ ఖాన్ హ్యాట్రిక్ తీయడంతో కేకేఆర్ లక్ష్య చేధనలో తడబడింది. ఆఖరి ఓవర్లో 29 పరుగులు చేయాల్సి ఉండగా గుజరాత్ విజయం ఖాయమనుకున్నారంతా. కానీ రింకూ సింగ్ అద్భుతం చేశాడు. చివరి 5 బంతుల్లో 5 సిక్సర్లు కొట్టి కోల్‌కతాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
RCB vs LSG: ఈ మ్యాచ్‌లో మార్కస్ స్టోయినిస్ చెలరేగి ఆడటంతో లక్నో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లకు 212 పరుగులు చేసింది. లక్ష్య చేధనలో స్టోయినిస్ 65 పరుగులతో రాణించడంతో లక్నో వికెట్ తేడాతో గెలుపొందింది.
CSK vs PBKS: ఈ మ్యాచ్‌లో హీరో ప్రభుసిమ్రన్ సింగ్. చెన్నై సూపర్ కింగ్స్ 200 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా ప్రభుసిమ్రన్ సింగ్ 42 పరుగులు చేయడంతో పాటు మిగతా బ్యాటర్లు సమష్టిగా రాణించడంతో పంజాబ్ విజయం సాధించింది.
RR vs MI: సూర్య కుమార్ యాదవ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో ఈ మ్యాచ్‌లో ముంబై ఘన విజయం సాధించింది. మొదట రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేయగా ముంబై 6 వికెట్లు కోల్పోయి మరో ౩ బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది.
PBKS vs MI: మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కేవలం మూడే వికెట్లు కోల్పోయి 214 రన్స్ చేసింది. ఛేజింగ్‌లో ఇషాన్ కిషన్ చెలరేగడంతో 18.5 ఓవర్లలోనే ముంబై గెలుపొందింది.
RR vs SRH: నరాలు తెగే ఉత్కంఠతో సాగిన మ్యాచ్‌లో సందీప్ శర్మ నోబాల్ వేయడంతో విజయం తారుమారు అయింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత ఓవర్లలో 214 పరుగులు చేసింది. గ్లెన్ ఫిలిఫ్స్ మెరుపు ఇన్నింగ్స్‌కు తోడు అబ్దుల్ సమద్ లాస్ట్ బాల్కి సిక్స్ కొట్టడంతో హైదారాబాద్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
వీటితో పాటు ఈ సీజన్లో అత్యధిక లక్ష్యాన్ని(215 పరుగులు) ఛేదించిన టీంలుగా ముంబై, సన్‌రైజర్స్ నిలిచాయి. ఐపీఎల్ మొత్తంగా చూసుకుంటే అత్యధిక లక్ష్యాన్ని(224) చేజ్ చేసిన రికార్డు రాజస్థాన్ పేరుమీద ఉంది. 2020లో పంజాబ్‌పై ఈ ఫీట్‌ను సాధించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parkinson’s Disease | పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సలో కీలక ముందడుగు.. మూలకణాలతో మెరుగైన ఫలితాలు..
Tirumala | శ్రీవారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం
Kanpur Accident: థార్ వాహనంతో స్కూటర్‌ను ఢీకొట్టిన మహిళ.. కాన్పూర్ ఘటనలో ఒకరు మృతి
Auto | చెట్లు నాటి తిరిగొస్తుండగా.. టిప్పర్‌ను ఢీకొట్టిన కూలీల ఆటో
DADA | డిసెంబర్ 24న దాదా ధమాకా.. నవంబర్ 13న ఫస్ట్ సాంగ్, థమన్ మ్యూజిక్‌తో టాలీవుడ్లో భారీ హైప్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

