IPL Final CSK vs KKR | దుబాయి వేదికగా కాసేపట్లో ఐపీఎల్-14 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ట్రోఫీ కోసం చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్‌లో భాగంగా ధోనీ సేనపై టాస్ గెలిచిన మోర్గాన్.. బౌలింగ్ ఎంచుకున్నాడు.
ప్రత్యర్థులపై అద్భుత విజయాలతో ఫైనల్లోకి దూసుకొచ్చిన చెన్నై, కోల్‌కతా మరోమారు కప్‌ను ముద్దాడేందుకు తహతహలాడుతున్నాయి. రికార్డు స్థాయిలో తొమ్మిది సార్లు ఫైనల్లో నిలిచిన చెన్నై మూడుసార్లు టైటిల్ గెలిచింది. 2010, 2011, 2018 సీజన్లలో చెన్నై ఛాంపియన్‌గా నిలిచింది. ఇప్పుడు నాలుగోసారి ఎలాగైనా కప్ గెలవాలని ఉవ్విళ్లూరుతుంది. ఇప్పటికే 2012, 2014లో ఫైనల్‌కు చేరిన కోల్‌కతా రెండు సార్లు కప్ గెలిచింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి కూడా టైటిల్ గెలవాలని మోర్గాన్ సేన సర్వశక్తులు ఒడ్డి పోరాడుతున్నది.
Hello & welcome from Dubai for the #VIVOIPL #Final 👏 👏
— IndianPremierLeague (@IPL) October 15, 2021
It's the @msdhoni-led @ChennaiIPL who take on @Eoin16's @KKRiders in what promises to be a cracking contest. 👍 👍 #CSKvKKR
💛 or 💜 – your pick❓ pic.twitter.com/q0ZrSC9VvF