Sumit Nagal | మాంటెకార్లో: భారత యువ టెన్నిస్ ప్లేయర్ సుమిత్ నాగల్ సంచలనం సృష్టించాడు. ప్రతిష్ఠాత్మక మాంటెకార్లో మాస్టర్స్ టోర్నీలో ప్రధాన రౌండ్‌కు అర్హత సాధించి సత్తాచాటాడు. గత 42 ఏండ్లలో ఈ ఘనత సాధించిన తొలి భారత ప్లేయర్‌గా నాగల్ అరుదైన రికార్డు సాధించాడు. ఆదివారం జరిగిన తుది అర్హత రౌండ్ పోరులో నాగల్ 7-5, 2-6, 6-2తో ఫాకుండో డియాజ్ అకోస్టా(అర్జెంటీనా)పై అద్భుత విజయం సాధించాడు.
రెండున్నర గంటల పాటు సాగిన మ్యాచ్‌లో తన(95వ) మెరుగైన ర్యాంక్ (55వ)లో ఉన్న డియాజ్‌ను ఈ యువ ప్లేయర్ మట్టికరిపించాడు. మెయిన్‌డ్రా తొలి మ్యాచ్‌లో మాటియో అర్నాల్డీ(ఇటలీ)తో నాగల్ తలపడుతాడు. ‘మాంటెకార్లో ఓపెన్‌లో మెయిన్‌డ్రాకు అర్హత సాధించడం థ్రిల్లింగ్‌గా ఉంది. భారత్ నుంచే ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి’ అని నాగల్ అన్నాడు.