Badminton | అమ్మాయిలు అదరహో.. ఆసియా బ్యాడ్మింటన్ టైటిల్ కైవసం
భారత మహిళల బ్యాడ్మింటన్ జట్టు చరిత్ర సృష్టించింది. ప్రతిష్ఠాత్మక ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్‌షిప్‌లో మన అమ్మాయిల జట్టు స్వర్ణం కొల్లగొట్టింది.
Badminton | షాఆలమ్: భారత మహిళల బ్యాడ్మింటన్ జట్టు చరిత్ర సృష్టించింది. ప్రతిష్ఠాత్మక ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్‌షిప్‌లో మన అమ్మాయిల జట్టు స్వర్ణం కొల్లగొట్టింది. సుదీర్ఘ కాలంగా అందని ద్రాక్షలా ఊరిస్తున్న ఆసియా టైటిల్‌ను పీవీ సింధు సారథ్యంలోని భారత జట్టు ఒడిసిపట్టింది. ఆదివారం హోరాహోరీగా సాగిన ఫైనల్లో భారత్ 3-2తో థాయ్‌లాండ్‌పై నెగ్గి మొదటిసారి ఈ టోర్నీ విజేతగా అవతరించింది. గతంలో ఈ టోర్నీలో పురుషుల జట్టు రెండుసార్లు (2016, 2020) కాంస్య పతకాలు గెలిచింది. టైలో భాగంగా జరిగిన తొలి సింగిల్స్ మ్యాచ్‌లో రెండు ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు 21-12, 21-12తో సుపనిడా కాటెథాంగ్పై విజయం సాధించి జట్టుకు శుభారంభాన్నిచ్చింది.
గాయం నుంచి కోలుకున్న తర్వాత తిరిగి పుంజుకునేందుకు కాస్త సమయం తీసుకున్న ఈ తెలుగమ్మాయి.. ఆసియా చాంపియన్‌షిప్‌తో మునుపటి ఫామ్ అందుకుంది. డబుల్స్ పోరులో పుల్లెల గాయత్రి గోపీచంద్-త్రిసా జాలీ జంట 21-16, 18-21, 21-16తో జాంకోల్ఫాన్-రవిండా ప్రాద్వయంపై విజయం సాధించింది. ఆ తర్వాత సింగిల్స్‌లో అశ్మిత చలిహా డబుల్స్‌లో శృతి-ప్రియ ఓటమి పాలయ్యారు. దీంతో స్కోరు 2-2తో సమమైంది. ఈ సమయంలో జరిగిన నిర్ణయాత్మక మ్యాచ్‌లో 17 ఏండ్ల అన్మోల్ 21-14-21-9తో ప్రత్యర్థిని చిత్తుచేయడంతో భారత జట్టు సంబురాల్లో మునిగిపోయింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

