2401 రోజుల తర్వాత..

- టెస్టు బరిలో భారత మహిళల జట్టు
- నేటి నుంచి ఇంగ్లండ్‌తో పోరు
- మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సోనీ నెట్‌వర్క్‌లో
భారత మహిళల జట్టు సుదీర్ఘ నిరీక్షణకు తెరపడే సమయం వచ్చేసింది. దాదాపు ఏడేండ్ల తర్వాత మిథాలీసేన టెస్టు సమరంలో తలపడనుంది. నేటి నుంచి ఇంగ్లండ్‌తో జరిగే ఏకైక టెస్టుతో మళ్లీ తెల్ల జెర్సీల్లో టీమ్ఇండియా అమ్మాయిలు మెరవనున్నారు. సంప్రదాయ ఫార్మాట్లో ఇంగ్లిష్ గడ్డపై అజేయ రికార్డును కొనసాగించాలని పట్టుదలగా ఉన్న భారత జట్టుకు ప్రాక్టీస్ లేమి సవాల్‌గా మారింది. అయితే గతంలో హ్యాట్రిక్ టెస్టు విజయాలు గుర్తుచేసుకొని సానుకూల దృక్పథంతో దిగి సత్తాచాటాలని మిథాలీ అండ్ కో తహతహలాడుతున్నది.
బ్రిస్టల్: ఇంగ్లండ్ గడ్డపై మెరుగైన రికార్డు, సీనియర్ ప్లేయర్లతో పటిష్టంగా ఉన్న భారత మహిళల జట్టు సుదీర్ఘ విరామం తర్వాత టెస్టు సమరానికి సిద్ధమైంది. బుధవారం నుంచి ఇక్కడ జరిగే ఏకైక టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్‌ను మిథాలీసేన ఢీకొట్టనుంది. 2014 నవంబర్ తర్వాత భారత మహిళలకు ఇదే తొలిటెస్టు. చివరగా దక్షిణాఫ్రికాతో టెస్టు ఆడిన కెప్టెన్ మిథాలీ రాజ్ సహా ఏడుగురు ప్లేయర్లు ప్రస్తుత జట్టులో ఉన్నారు. అయితే సారథితో పాటు వైస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, జులన్ గోస్వామి సహా భారత ప్లేయర్లు ఇటీవలి కాలంలో ఎర్రబంతి మ్యాచ్‌లు ఆడకపోవడం కాస్త ప్రతికూలంశం. అలాగే కరోనా వైరస్ ప్రభావం కారణంగా బయోబబుల్‌లో ఉండాల్సి రావడంతో మిథాలీసేన సరైన ప్రాక్టీస్ కూడా చేయలేకపోయింది.
పటిష్టంగా బ్యాటింగ్
మిథాలీ, హర్మన్‌ప్రీత్, మంధానతో కూడిన భారత బ్యాటింగ్ దళం పటిష్టంగా కనిపిస్తుంటే.. టెస్టు అరంగేట్రంలోనే దూకుడుతో దూసుకెళ్లాలని యువ ప్లేయర్ షెఫాలీ వర్మ పట్టుదలగా ఉంది. అనుభవం, యువరక్తం మేళవింపుతో ఉన్న టీమ్ఇండియా సమిష్టిగా రాణిస్తే ఇంగ్లండ్ బౌలర్లకు సొంత గ్రౌండ్లో చెమటలు పట్టడం ఖాయమే. జులన్ గోస్వామి, శిఖా పాండే సుదీర్ఘ స్పెల్స్ ఎలా వేస్తారో చూడాలి. మరోవైపు ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ హీథర్ నైట్ కూడా గెలుపుపై ధీమాతో ఉంది. 2014లో భారత్‌తో టెస్టు ఆడిన ఆరుగురు ప్లేయర్లు ఇప్పుడు ఇంగ్లండ్ జట్టులో ఉన్నారు. భారత జట్టులో అత్యధికంగా మిథాలీ, జులన్‌కు 10 టెస్టులు ఆడిన అనుభవం ఉండగా.. వీరిద్దరూ 2002లో ఇంగ్లండ్‌పై ఒకే మ్యాచ్‌లో అరంగేట్రం చేశారు.
- గత మూడు టెస్టుల్లో టీమ్ఇండియా హ్యాట్రిక్ విజయాలు సాధించింది. 2014లో ఇంగ్లండ్‌తో రెండు, దక్షిణాఫ్రికాపై ఓ మ్యాచ్‌లో గెలిచింది. ఇక ఈ మ్యాచ్‌లో గెలిస్తే వరుసగా అత్యధిక టెస్టు విజయాలు సాధించిన మహిళల జట్టుగా రికార్డు సొంతం చేసుకుంటుంది.
- ఇంగ్లండ్ గడ్డపై 8 టెస్టు లు ఆడిన భారత్ రెండింట గెలిచింది. ఆరు మ్యాచ్‌లను డ్రా చేసుకొని అజేయ రికార్డుతో ఉంది. కాగా ఇంగ్లిష్ జట్టుతో మొత్తంగా 13 టెస్టుల్లో తలపడిన భారత్ రెండింట గెలిచి.. ఓ మ్యాచ్‌లో పరాజయం పాలైంది. 10 డ్రాగా ముగిశాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

