అల్మటి: యూడబ్ల్యూడబ్ల్యూ ర్యాంకింగ్స్ సిరీస్ రెజ్లింగ్ టోర్నీలో భారత స్టార్ రెజ్లర్ సరితా మోర్ స్వర్ణం కొల్లగొట్టింది. అల్మటీ వేదికగా జరిగిన 59 కిలోల విభాగం ఫైనల్లో ఝాల అలియెవ (అజర్బైజన్)పై నెగ్గి ఈ సీజన్లో తొలి పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది.
వరుసగా మూడు బౌట్లలో సరిత దూకుడు కనబర్చింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌తో పాటు ఆసియా చాంపియన్‌షిప్‌లో కాంస్యం చేజిక్కించుకున్న సరితకు ఈ సీజన్లో ఇదే తొలి పతకం కావడం విశేషం. ఈ టోర్నీలో ఇప్పటికే సాక్షి మాలిక్‌తో పాటు మాన్సి (57 కి), దివ్య కక్రాన్ (68 కి) పసిడి పతకాలు చేజిక్కించుకోగా.. పూజా సిహగ్ (76 కి) కాంస్యం కైవసం చేసుకుంది.