ప్రణయ్ ముందంజ
జపాన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత ఆటగాడు, ఏడో సీడ్ హెచ్.ఎస్.ప్రణయ్ ముందంజ వేశాడు. బుధవారం హాంకాంగ్ ఆటగాడు లీ చౌక్ యుతో జరిగిన పోరులో ప్రణయ్ మూడు గేమ్‌ల పోరులో 22-20, 19-21, 21-17తో విజయం సాధించాడు.
కుమమోటొ : జపాన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత ఆటగాడు, ఏడో సీడ్ హెచ్.ఎస్.ప్రణయ్ ముందంజ వేశాడు. బుధవారం హాంకాంగ్ ఆటగాడు లీ చౌక్ యుతో జరిగిన పోరులో ప్రణయ్ మూడు గేమ్‌ల పోరులో 22-20, 19-21, 21-17తో విజయం సాధించాడు. కాగా ఇతర మ్యాచ్‌లలో లక్ష్య సేన్, ప్రియాంశు రజవత్ ఓటమిపాలయ్యారు. గాయంనుంచి కోలుకుని పాల్గొన్న తొలి టోర్నీ తొలి మ్యాచ్‌లో ప్రణయ్ సత్తాచాటాడు. హోరాహోరీగా సాగిన మూడు గేమ్‌లలో ఇరువురూ నువ్వానేనా అన్నట్టు తలపడ్డారు. తొలి గేమ్ టైబ్రేక్‌కు దారితీయగా, రెండో గేమ్‌ను రెండు పాయింట్ల తేడాతో ప్రణయ్ కోల్పోయాడు. ఇక మూడో గేమ్ ఆరంభంలో ఆధిక్యం పలుమార్లు చేతులు మారినా, మ్యాచ్ కొనసాగేకొద్దీ ప్రణయ్ ఆటపై పట్టు సాధించి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. మరో మ్యాచ్‌లో యువ ఆటగాడు లక్ష్య సేన్ వరుస గేమ్‌లలో జపాన్‌కు చెందిన కొడై నరవోక చేతిలో 17-21, 10-21తో ఓడిపోయాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

