ఒస్జెక్: ప్రతిష్ఠాత్మక ప్రపంచ పారా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత పారా షూటర్ రుద్రాంశ్ ఖండెవాల్..వరల్డ్ రికార్డుతో పసిడి పతకం కొల్లగొట్టాడు. సోమవారం జరిగిన పీ4 మిక్స్డ్ 50మీటర్ల పిస్టల్ ఎస్‌హెచ్1 కేటగిరీ బరిలోకి దిగిన రుద్రాంశ్ ఫైనల్లో 231.1 స్కోరుతో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఇదే విభాగంలో పోటీపడ్డ భారత్‌కే చెందిన నిహాల్‌సింగ్ 222.2 స్కోరుతో రెండో స్థానంతో రజత పతకం ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు అవని లేఖర ఆరో స్థానంలో నిలిచింది.