Indian Hockey | టీమిండియా చరిత్ర.. ! ఆసియా చాంఫియన్స్ హాకీ ట్రోఫీ విజేత భారత్
Indian Hockey | భారత హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. ఆసియా ఛాంపియన్స్ హాకీ ట్రోఫీని నెగ్గింది. వరుసగా రెండోసారి టైటిల్‌ని నిలుబెట్టుకున్న టీమిండియా.. మొత్తం ఐదుసార్లు ట్రోఫీని నెగ్గింది. ఫైనల్ మ్యాచ్‌లో చైనాపై 1-0 తేడాతో విజయం సాధించింది.
Indian Hockey | భారత హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. ఆసియా ఛాంపియన్స్ హాకీ ట్రోఫీని నెగ్గింది. వరుసగా రెండోసారి టైటిల్‌ని నిలుబెట్టుకున్న టీమిండియా.. మొత్తం ఐదుసార్లు ట్రోఫీని నెగ్గింది. ఫైనల్ మ్యాచ్‌లో చైనాపై 1-0 తేడాతో విజయం సాధించింది. ఫైనల్లో జుగ్రాజ్ సింగ్ నాల్గో క్వార్టర్లో తొలి గోల్‌ను చేయడంతో టీమిండియా ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ప్రత్యర్థికి ఛాన్స్ ఇవ్వకుండా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ నేతృత్వంలోని బృందం కప్‌ని సొంతం చేసుకున్నది. ఆసియా ఛాంపియన్స్ హాకీ టైటిల్‌ని భారత్ ఇప్పటి వరకు ఐదుసార్లు నెగ్గింది. ఆ తర్వాత పాక్ మూడుసార్లు ట్రోఫీని కైవసం చేసుకున్నది. 2021లో దక్షిణ కొరియా టైటిల్‌ని నెగ్గింది.
చైనా ఫైనల్‌కు చేరుకోవడం ఇదే తొలిసారి. టోర్నీ చరిత్రలోనే తొలిసారిగా అత్యుత్తమంగా ఫైనల్‌కు చేరింది. భారత్ గ్రూప్ దశలో జపాన్ను 5-1 తేడాతో ఓడించింది. చైనాను 3-0, మలేషియాపై 8-1, దక్షిణ కొరియాను 3-1, చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై ఉత్కంఠ పోరులో 2-1 తేడాతో విజయం సాధించింది. సెమీ ఫైనల్స్‌లో దక్షిణ కొరియాపై 4-1 తేడాతో విజయం సాధించింది. హర్మన్‌ప్రీత్ సింగ్ నేతృత్వంలోని జట్టు చరిత్రలో తొలిసారిగా వరుసగా బ్యాక్ టు బ్యాక్ ఎడిషన్స్‌లో టైటిల్స్‌ను నిలబెట్టుకున్నది. గతేడాది చెన్నైలో జరిగిన సమ్మిట్‌లో మలేషియాను 4-3తో ఓడించి సొంతగట్టపై టైటిల్‌ను నెగ్గింది. గతంలో 2021, 2016లో భారత్ ట్రోఫీని నెగ్గింది. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ ఏడు గోల్స్‌తో పోటీలో అత్యధిక గోల్స్ చేసిన రెండో ఆటగాడిగా నిలువగా.. దక్షిణ కొరియాకు చెందిన యాంగ్ జి-హున్ అగ్రస్థానంలో నిలిచాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | ఆంధ్రాకు నీళ్లు.. తెలంగాణకు ఎక్కిళ్లు.. కలుపుమొక్క కాంగ్రెస్‌ను నమ్మితే సంక్షేమం సర్వనాశనమైంది : కేటీఆర్
Ranganath | హైడ్రా రంగనాథ్‌ను హైకోర్టుకు పట్టుకురండి.. డీజీపీకి న్యాయమూర్తి జస్టిస్ భాస్కర్‌రెడ్డి ఆదేశం
Intermediate Education | ఇంటర్ విద్య రద్దు.. పీవీపై అక్కసుతోనే నిర్ణయమన్న ఇంటర్ జేఏసీ
IPL Player Trade | డీల్ డన్.. పాండ్యా, అర్ష్‌దీప్ ట్రేడింగ్‌కు ఆమోదం.. మళ్లీ రోహిత్‌కే ఎంఐ పగ్గాలు?
Ambulance Shortage | కొడంగల్ క్రిటికల్ కేర్..ట్రాక్టరే అంబులెన్స్ రేవంత్ ఇలాకాలో ఘటన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

