బాకు (అజర్బైజాన్): భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద ప్రతిష్ఠాత్మక ఫిడే చెస్ ప్రపంచకప్ ఫైనల్ తొలి గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్నాడు. అజర్బైజాన్ వేదికగా మంగళవారం ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్సన్తో జరిగిన తుదిపోరు తొలి గేమ్‌ను 18 ఏండ్ల ప్రజ్ఞానంద ‘డ్రా’గా ముగించాడు. తెల్లపావులతో ఆడిన భారత గ్రాండ్‌మాస్టర్ 35 ఎత్తుల్లో ప్రత్యర్థిని ‘డ్రా’కు ఒప్పించాడు.
‘మ్యాచ్‌లో నాకు ఎలాంటి ఇబ్బంది ఎదురైనట్లు అనిపించలేదు. రెండో గేమ్‌లో కార్ల్సన్ నుంచి మరింత ప్రతిఘటన ఎదురవడం ఖాయమే. అందుకు తగిన విధంగా సిద్ధమవుతా’ అని ప్రజ్ఞానంద పేర్కొన్నాడు. భారత చదరంగ చరిత్రలో.. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత వరల్డ్‌కప్ ఫైనల్‌కు చేరిన రెండో ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కిన ప్రజ్ఞానంద.. తుదిపోరులో చక్కటి ఆటతీరు కనబర్చాడు.