రిఫ్పా(బహ్రెయిన్): ఏషియన్ యూత్ గేమ్స్‌లో భారత యువ అథ్లెట్ రంజన యాదవ్ రజత పతకంతో మెరిసింది. బహ్రెయిన్ నేషనల్ స్టేడియంలో గురువారం జరిగిన బాలికల 5000మీటర్ల రేసును రంజన 23నిమిషాల 25.88 సెకన్లలో పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచింది.
ఇదే రేసులో లియు షియి(చైనా), జియింగ్ చియోన్(కొరియా) వరుసగా స్వర్ణ, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. పతకాల పట్టికలో భారత్ రెండు రజతాలు, నాలుగు కాంస్య పతకాలతో కొనసాగుతున్నది.