ముంబై : ఇంగ్లండ్-ఎ జట్టుతో బుధవారం ఉత్కంఠగా సాగిన టీ20 మ్యాచ్‌లో భారత్-ఎ మహిళల జట్టు 3 పరుగుల తేడాతో గెలిచింది. 135 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్-ఎ 8 వికెట్లకు 131 పరుగులే చేసింది. ఒక దశలో నాలుగో వికెట్‌కు వైస్‌కెప్టెన్ హోలీ ఆర్మిటేజ్(52), సెరెన్ స్మేల్(31) నాలుగో వికెట్‌కు 70 పరుగులు జోడించి ఇంగ్లండ్ జట్టును పోటీలో నిలిపారు.
‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ శ్రేయాంక (2/26) చివరి ఓవర్లో విజయానికి 13 పరుగులు అవసరమైన దశలో 10 పరుగులు మాత్రమే ఇచ్చింది. అంతకుముందు భారత జట్టు 134/7 స్కోరు చేసింది.