వన్డే వార్

- నేడు భారత్, దక్షిణాఫ్రికా తొలి వన్డే
- కెప్టెన్‌గా రాహుల్.. ఆటగాడిగా విరాట్
- మధ్యాహ్నం 2.00 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో
ఎన్నో అంచనాలతో దక్షిణాఫ్రికాలో అడుగుపెట్టి అనూహ్యరీతిలో టెస్టు సిరీస్ కోల్పోయిన టీమ్ఇండియా.. ఇక వన్డే సమరానికి సిద్ధమైంది. టెస్టు కెప్టెన్సీకి వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లీ ఆటగాడిగా బరిలోకి దిగనుండగా.. రోహిత్ శర్మ గైర్హాజరీలో కేఎల్ రాహుల్ జట్టును ముందుకు నడిపించనున్నాడు. నాలుగేండ్ల తర్వాత అశ్విన్ వన్డే జట్టులోకి రాగా.. గతేడాది మార్చి తర్వాత టీమ్ఇండియా పూర్తిస్థాయి జట్టుతో వన్డే సిరీస్ ఆడనుంది! టెస్టు సిరీస్ పరాజయానికి బదులు తీర్చుకోవాలని భారత్ భావిస్తుంటే.. ఆ విజయం ఇచ్చిన జోష్‌తో వన్డేల్లోనూ సత్తాచాటాలని సఫారీలు చూస్తున్నారు.
పార్ల్: సుదీర్ఘ ఫార్మాట్లో సఫారీల చేతిలో ఓటమి పాలైన టీమ్ఇండియా.. వన్డే సిరీస్‌కు సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా.. బుధవారం భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి పోరు జరుగనుంది. ఏడేండ్ల తర్వాత విరాట్ కోహ్లీ ఓ ఆటగాడిలా బరిలోకి దిగుతుండగా.. కేఎల్ రాహుల్ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌నకు ముందే విరాట్.. పొట్టి ఫార్మాట్ సారథ్యానికి వీడ్కోలు పలుకగా.. ఆ తర్వాత బోర్డు అతడిని వన్డే కెప్టెన్సీ నుంచి కూడా తొలిగించింది. ఈ నిర్ణయం తీసుకున్న అనంతరం భారత జట్టు వన్డే సిరీస్ ఆడనుండటం ఇదే తొలిసారి కాగా.. రెగ్యులర్ కెప్టెన్‌గా ఎంపిక చేసిన రోహిత్ శర్మ గాయంతో బాధపడుతుండటంతో అతడి స్థానంలో రాహుల్ తాత్కాలిక సారథిగా వ్యవహరించనున్నాడు. దీంతో కేవలం ఆటగాడిగానే మైదానంలో అడుగుపెట్టనున్న విరాట్‌పైనే అందరి దృష్టి ఉండనుంది. ఇటీవలి కాలంలో రాహుల్ మిడిలార్డర్లో బ్యాటింగ్ చేస్తున్నా.. రోహిత్ గైర్హాజరీలో ధవన్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. దేశవాళీల్లో దుమ్మురేపుతున్న రుతురాజ్ గైక్వాడ్ బెంచ్‌కే పరిమితమయ్యే చాన్స్ ఉంది. వన్‌డౌన్‌లో విరాట్ బ్యాటింగ్‌కు రానుండగా.. నాలుగో స్థానం కోసం సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ మధ్య పోటీ నెలకొంది. ఫామ్ ప్రకారం చూసుకుంటే సూర్యకుమార్‌కే చాన్స్ దక్కొచ్చు. ఐదో స్థానంలో పంత్ బ్యాటింగ్‌కు రానుండగా.. పేస్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ వన్డే అరంగేట్రం చేయడం దాదాపు ఖాయమే. పిచ్ స్పిన్‌కు సహకరించనున్న నేపథ్యంలో అశ్విన్‌తో పాటు చాహల్ జట్టులో ఉండనున్నారు. దాదాపు నాలుగేండ్ల తర్వాత అశ్విన్ వన్డే ఆడనుండగా.. వైస్ కెప్టెన్ బుమ్రా పేస్ బాధ్యతలు మోయనున్నాడు. అతడితో పాటు భువనేశ్వర్ , దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్‌లో ఇద్దరు తుది జట్టులో చోటు దక్కించుకోనున్నారు. మరోవైపు పటిష్ట భారత జట్టుపై టెస్టు సిరీస్ నెగ్గిన దక్షిణాఫ్రికా.. వన్డేల్లోనూ అదే జోరు కొనసాగించాలని చూస్తున్నది. సుదీర్ఘ ఫార్మాట్‌కు అర్ధాంతరంగా వీడ్కోలు పలికిన క్వింటన్ డికాక్ వన్డేల్లో ఆడుతుండగా.. మిల్లర్, ఫెలుక్వాయో వంటి స్పెషలిస్ట్ ఆటగాళ్లతో సఫారీ జట్టు బలంగా కనిపిస్తున్నది.
పిచ్, వాతావరణం
బౌండ్రీలైన్ తక్కువ దూరం ఉండటంతో పరుగుల వరదపారే అవకాశముంది. పిచ్ నుంచి స్పిన్నర్లకు సహకారం లభించొచ్చు. మ్యాచ్‌కు వర్ష సూచన లేదు. వాతావరణం వేడిగా ఉండనుంది.
చాహల్ మరో మూడు వికెట్లు పడగొడితే వన్డేల్లో టీమ్ఇండియా తరఫున వంద వికెట్లు తీసిన 23వ బౌలర్‌గా నిలుస్తాడు.
తుది జట్లు (అంచనా)
భారత్: రాహుల్ (కెప్టెన్), ధవన్, కోహ్లీ, సూర్యకుమార్, పంత్, వెంకటేశ్, అశ్విన్, చాహల్, బుమ్రా, దీపక్, శార్దూల్/భువనేశ్వర్.
దక్షిణాఫ్రికా: బవుమా (కెప్టెన్), డికాక్, మలన్, మార్క్మ్,్ర డసెన్, మిల్లర్, ప్రిటోరియస్/లిండే, ఫెలుక్వాయో, రబడ, ఎంగ్డీ, షంసీ.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

