భారత్ క్లీన్‌స్వీప్
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత మహిళల జట్టు 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఇప్పటికే సిరీస్ సొంతం చేసుకున్న హర్మన్‌ప్రీత్ కౌర్ సేన.. ఆదివారం బెంగళూరు వేదికగా జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 215/8కే పరిమితమైంది.
- మంధాన మూడో సెంచరీ మిస్
బెంగళూరు: స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత మహిళల జట్టు 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఇప్పటికే సిరీస్ సొంతం చేసుకున్న హర్మన్‌ప్రీత్ కౌర్ సేన.. ఆదివారం బెంగళూరు వేదికగా జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 215/8కే పరిమితమైంది.
ఆ జట్టు సారథి లారా వోల్వార్డ్ (61) రాణించింది. దీప్తి శర్మ (2/27), అరుంధతి రెడ్డి (2/36) సఫారీలను కట్టడిచేశారు. ఛేదనను భారత్ 40.4 ఓవర్లలోనే (220/4) పూర్తిచేసింది. ఈ సిరీస్‌లో వరుసగా రెండు శతకాలు చేసిన ఓపెనర్ స్మృతి మంధాన (83 బంతుల్లో 90, 11 ఫోర్లు) తృటిలో మూడో శతకాన్ని చేజార్చుకున్నా మరో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడింది. దీప్తికి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, మంధానకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ దక్కాయి. ఇరుజట్ల మధ్య ఈనెల 28న చెన్నై వేదికగా ఏకైక టెస్టు జరుగనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రేపు గద్వాలలో పర్యటించనున్న హరీశ్ రావు.. షెడ్యూల్ ఇదే..!
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్‌కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

