ఫైనల్లో యువ భారత్
యువ భారత్ అదరగొట్టింది. అండర్-19 ఆసియా కప్ వన్డే టోర్నీలో ఫైనల్ చేరుకొని ట్రోఫీకి అడుగు దూరంలో నిలిచింది.
- సెమీస్ లో అఫ్గాన్ పై గ్రాండ్ విక్టరీ
- మెరిసిన రాయ్‌చందానీ, ఇషాన్ సూద్
- రేపు పాకిస్థాన్‌తో తుదిపోరు
అల్ అమెరత్ (ఒమన్): యువ భారత్ అదరగొట్టింది. అండర్-19 ఆసియా కప్ వన్డే టోర్నీలో ఫైనల్ చేరుకొని ట్రోఫీకి అడుగు దూరంలో నిలిచింది. పేసర్ ఇషాన్ సూద్ (3/43) ఖతర్నాక్ బౌలింగ్ కు తోడు బ్యాట్ తో కెప్టెన్ లక్ష్య రాయ్‌చందానీ (90 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్ తో 93), వీకే వినీత్ (57 నాటౌట్), ఆర్యవీర్ సెహ్వాగ్ (51) దంచికొట్టడంతో గురువారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 8 వికెట్ల తేడాతో అఫ్గానిస్థాన్ ను చిత్తు చేసింది. భారత్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో తొలుత అఫ్గాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 227 పరుగులకే పరిమితమైంది.
నొమాన్ సలార్జాయ్ (51), షా ఫైజల్ (51) అర్ధశతకాలతో మెరిసినా భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీసి ఆ జట్టుపై ఒత్తిడి పెంచారు. ఆర్యన్ సవసాని (2/29) రెండు వికెట్లతో రాణించాడు. అనంతరం చిన్న లక్ష్యాన్ని యువ భారత్ 36.5 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు రాయ్‌చందానీ, ఆర్యవీర్ సెహ్వాగ్ తొలి వికెట్‌కు 17 ఓవర్లలోనే 117 పరుగులు జోడించి విజయానికి బలమైన పునాది వేశారు. దూకుడుగా ఆడిన రాయ్‌చందానీ 39 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు.
మరోవైపు 4 సిక్సర్లతో అఫ్గాన్ బౌలర్లపై ఒత్తిడి పెంచిన ఆర్యవీర్ హాఫ్ సెంచరీ చేసిన వెంటనే ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన వినీత్ తో కలిసి రెండో వికెట్‌కు 77 పరుగులు జోడించిన రాయ్‌చందానీ సెంచరీకి చేరువైన దశలో భారీ షాట్‌కు ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. అయినా వినీత్ వరుసగా ఫోర్, సిక్సర్ బాది మ్యాచ్‌ను ముగించాడు. రాయ్చందానీకే ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. మరో మ్యాచ్ లో పాకిస్థాన్ 9 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ ను ఓడించింది. శనివారం జరిగే తుదిపోరులో చిరకాల ప్రత్యర్థులు ట్రోఫీ కోసం తలపడనున్నాయి. గ్రూప్ దశలో పాక్ చేతిలో ఎదురైన ఓటమికి ఫైనల్లో ప్రతీకారం తీర్చుకొని టైటిల్ ఎగరేసుకుపోవాలని భారత్ పట్టుదలతో ఉంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

