T20 World Cup | సెమీస్‌కు భారత్.. టీ20 ప్రపంచకప్‌లో కొనసాగుతున్న అజేయ ప్రస్థానం
ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌లో భారత్ అదరగొడుతున్నది. తమ సుదీర్ఘ కలను సాకారం చేసుకునే క్రమంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 50 పరుగుల తేడాతో బంగ్లాపై ఘన విజయం సాధించింది. దీని ద్వారా గ్రూపు-1లో ప్రస్తుతం 4 పాయింట్లతో టాప్‌లోకి దూసుకొచ్చింది.
- బంగ్లాదేశ్‌పై భారీ విజయం
- రాణించిన హార్దిక్, కుల్దీప్, బుమ్రా
- టీ20 ప్రపంచకప్ టోర్నీ
టీ20 ప్రపంచకప్‌లో భారత్ అజేయ ప్రస్థానం కొనసాగుతున్నది. మ్యాచ్ మ్యాచ్‌కు తమ సత్తాఏంటో చూపిస్తూ కప్ వేటలో దూసుకెళుతున్నది. సూపర్-8 తొలి పోరులో అఫ్గానిస్థాన్‌ను చిత్తుచేసిన భారత్..మలి పోరులో బంగ్లాదేశ్ భరతం పట్టింది. మెగాటోర్నీలో తమ గెలుపు రికార్డుకు మెరుగులు అద్దుకుంటూ టీమ్ఇండియా విజయఢంకా మోగించింది. ఆస్ట్రేలియాతో మరో మ్యాచ్ మిగిలుండగానే అనధికారికంగా సెమీఫైనల్ బెర్తు ఖాయం చేసుకుంది. హార్దిక్ పాండ్యా ధనాధన్ అర్ధసెంచరీకి తోడు కోహ్లీ, పంత్, దూబే రాణించడంతో భారీ స్కోరు అందుకున్న భారత్..బౌలింగ్‌లోనూ మెరుపులు మెరిపించింది. కుల్దీప్యాదవ్ స్పిన్ తంత్రానికి తోడు బుమ్రా, హార్దిక్, అర్ష్‌దీప్ జతకలువడంతో బంగ్లాకు ఓటమి ఖరారైంది.
T20 World Cup | నార్త్‌సౌండ్(అంటిగ్వా): ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌లో భారత్ అదరగొడుతున్నది. తమ సుదీర్ఘ కలను సాకారం చేసుకునే క్రమంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 50 పరుగుల తేడాతో బంగ్లాపై ఘన విజయం సాధించింది. దీని ద్వారా గ్రూపు-1లో ప్రస్తుతం 4 పాయింట్లతో టాప్‌లోకి దూసుకొచ్చింది. భారత్ నిర్దేశించిన 197 పరుగుల లక్ష్యఛేదనలో బంగ్లా 8 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్యాదవ్(3/19) మూడు వికెట్లతో విజృంభించగా, బుమ్రా(2/13), అర్ష్‌దీప్‌సింగ్(2/30), హార్దిక్(1/32) రాణించారు. కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్(40) టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. తొలుత బంగ్లాకు టాస్ కోల్పోయి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 196/5 స్కోరు చేసింది. హార్దిక్ పాండ్యా(27 బంతుల్లో 50 నాటౌట్, 4ఫోర్లు, 3సిక్స్‌లు), కోహ్లీ(37), పంత్(36), శివమ్‌దూబే(34) సాధికారిక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు. 108 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో పాండ్యా, దూబే బ్యాట్లు ఝులిపించారు. హార్దిక్ పాండ్యాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. ఈనెల 24న ఆస్ట్రేలియాతో భారత్ తలపడుతుంది.
పాండ్యా ఫటాఫట్:
మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఒకింత మెరుగైన శుభారంభమే దక్కింది. ఓపెనర్లు రోహిత్‌శర్మ(23), కోహ్లీ దూకుడుగానే ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఫామ్‌లేమితో ఇబ్బంది ఎదుర్కొంటున్న కోహ్లీ సిక్స్‌తో తన ఉద్దేశమేంటో చెప్పకనే చెప్పగా, రోహిత్ కూడా పోటీకి వచ్చాడు. షకీబ్ వేసిన ఇన్నింగ్స్ 4వ ఓవర్లో సిక్స్, ఫోర్‌తో జోరు మీద కనిపించిన రోహిత్..భారీ షాట్‌కు ప్రయత్నించి తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. దీంతో పవర్ ప్లే ముగిసే సరికి టీమ్ఇండియా వికెట్ కోల్పోయి 53 పరుగులు చేసింది. కోహ్లీ, పంత్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కుదురుగా సాగుతున్న ఆటను తంజిమ్ హసన్ దెబ్బతీశాడు.
మూడు బంతుల వ్యవధిలో కోహ్లీ, సూర్యకుమార్(6) ఔట్ చేసి బంగ్లాను పోటీలోకి తీసుకొచ్చాడు. కోహ్లీ క్లీన్‌బౌల్డ్ కాగా, సూర్య…కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఓవైపు సహచరులు నిష్క్రమిస్తున్నా..పంత్ పోరాటపటిమ కనబరిచాడు. వరుస ఓవర్లలో 4,6, 4, 6,4తో జోరుమీద కనిపించిన పంత్‌ను రిషాద్ హుస్సేన్ పెవిలియన్ పంపాడు. ఇక్కణ్నుంచి ఇన్నింగ్స్ బాధ్యతను పాండ్యా, దూబే భుజానేసుకున్నారు. వీరిద్దరు ఆచితూచి ఆడుతూ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరుబోర్డుకు పరుగులు జతచేశారు. బౌండరీ విషయంలో ఈ ఇద్దరు పోటీపడ్డారు. కుదరుకున్న తరుణంలో భారీ షాట్ కోసం ప్రయత్నించిన దూబే క్లీన్‌బౌల్డ్ కాగా, పాండ్యా దూకుడు ఆపలేదు. చూడచక్కని బౌండరీలతో 27 బంతుల్లో అర్ధసెంచరీ మార్క్ అందుకున్నాడు. ఈ క్రమంలో దూబేతో ఐదో వికెట్‌కు 53 పరుగులు, ఆరో వికెట్‌కు అక్షర్‌తో కలిసి పాండ్యా 35 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.
బంగ్లా తడబాటు:
భారీ లక్ష్యఛేదనలో బంగ్లా తడబడింది. భారత బౌలర్ల సమిష్టి ప్రదర్శనతో బంగ్లా బ్యాటర్లకు కళ్లెం వేశారు. కుల్దీప్యాదవ్ స్పిన్ మాయాజాలానికి తోడు పేసర్లు బుమ్రా, అర్ష్‌దీప్‌సింగ్ విజృంభణతో బంగ్లా జట్లు వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ఓవైపు చేధించాల్సిన లక్ష్యం భారీగా ఉండటం…క్రీజులో ఎవరూ నిలదొక్కుకోలేకపోవడం బంగ్లా గెలుపు అవకాశాలను దెబ్బతీసింది. నజ్ముల్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా, సహచర బ్యాటర్ల నుంచి సరైన సహకారం కరువైంది.
సంక్షిప్త స్కోర్లు:
భారత్: 20 ఓవర్లలో 196/5(పాండ్యా 50 నాటౌట్, కోహ్లీ 37, తంజిమ్ 2/32, రిషాద్ 2/43),
బంగ్లాదేశ్: 20 ఓవర్లలో 146/8(నజ్ముల్ 40, తంజిద్ 29, కుల్దీప్ 3/19, బుమ్రా 2/13)
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

