భారత్‌కు అడ్డుందా.. నేడు న్యూజిలాండ్‌తో నాలుగో టీ20
వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్ అభిషేక్ వర్మ, బీహార్ బుడ్డోడు వైభవ్ సూర్యవంశీ వీరబాదుడుతో వెల్లింగ్టన్ మైదానంలో 199 పరుగుల భారీ లక్ష్యాన్ని 13.2 ఓవర్లలోనే ఊదేసి సంచలనం సృష్టించిన టీమిండియా..
- మధ్యాహ్నం 12.30 నుంచి సోనీస్పోర్ట్స్‌లో
ఆక్లాండ్ (న్యూజిలాండ్) : వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్ అభిషేక్ వర్మ, బీహార్ బుడ్డోడు వైభవ్ సూర్యవంశీ వీరబాదుడుతో వెల్లింగ్టన్ మైదానంలో 199 పరుగుల భారీ లక్ష్యాన్ని 13.2 ఓవర్లలోనే ఊదేసి సంచలనం సృష్టించిన టీమిండియా.. న్యూజిలాండ్ గడ్డపై మరో పరుగుల సునామీకి సిద్ధమైంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఇప్పటికే 3-0తో సొంతం చేసుకున్న భారత్ వైట్ వాష్ పై కన్నేసింది. శుక్రవారం ఈడెన్ పార్క్ స్టేడియంలో జరిగే నాలుగో టీ20లోనూ న్యూజిలాండ్‌ను చిత్తుచేయాలనే లక్ష్యంతో ఉంది.
ఆక్లాండ్ మైదానం చిన్న బాండరీలకు పేరుగాంచింది. ముఖ్యంగా స్ట్రెయిట్ బౌండరీ చాలా తక్కువ దూరం ఉంటుంది. దాంతో వెల్లింగ్టన్లో 35 బంతుల్లోనే విధ్వంసకర శతకంతో చెలరేగిన అభిషేక్, సూర్యవంశీ దూకుడును అడ్డుకోవడం కివీస్ బౌలర్లకు పెద్ద సవాలుగా మారనుంది. రికార్డు స్థాయిలో దాదాపు 40 వేల మంది ప్రేక్షకులతో కిక్కిరిసిపోనున్న మైదానం భారత బ్యాట్ వీరుల మెరుపులతో మరోసారి పరుగుల వరదతో తడిసిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
బెంచ్‌కు పరీక్ష
ఓపెనర్లు అభి, సూర్య ఫామ్‌లో ఉండటం.. మిడిలార్డర్లో తిలక్, నితీశ్ రెడ్డి, నమన్ ధీర్ దంచికొడుతుండటంతో ఈ పోరులోనూ భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. అయితే, కెప్టెన్ అయ్యర్ టచ్‌లోకి రావాల్సిన అవసరం ఉంది. బౌలింగ్‌లో అర్ష్‌దీప్ సత్తా చాటుతుండగా.. వెటరన్ పేసర్ భువనేశ్వర్ మూడు మ్యాచ్‌ల్లో ఒకే వికెట్ తీసి నిరాశపరిచాడు. జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకోవాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో అయినా భువీ తన మునుపటి స్వింగ్ చూపెట్టాల్సిందే. ఇక, సిరీస్ ఇప్పటికే చిక్కడంతో రాబోయే వన్డే, టెస్టు సిరీస్‌లను దృష్టిలో ఉంచుకుని కీలక ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చే యోచనలో భారత యాజమాన్యం ఉంది. ఈ సిరీస్‌లో ఇప్పటిదాకా ఆడని స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తికి ఈ మ్యాచ్‌లో అవకాశం లభించవచ్చు. ఆల్ రౌండర్ నితీశ్ రెడ్డికి విశ్రాంతినిచ్చి శివం దూబే, లేదా మయాంక్ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకునే చాన్సుంది.
బ్లాక్‌క్యాప్స్‌కు గాయాల బెడద
మరోవైపు ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు వరుస ఓటములతో పాటు గాయాల సమస్యలతో డీలా పడింది. ఇప్పటికే మ్యాట్ హెన్రీ, జాక్ ఫౌల్క్స్ దూరం కాగా, ప్రధాన పేసర్ లోకీ ఫెర్గూసన్ కూడా గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. అతని స్థానంలో మ్యాట్ ఫిషర్ జట్టులోకి వచ్చాడు. బ్లెయిర్ టిక్నర్ కూడా తుది జట్టులోకి రావొచ్చు. డారిల్ మిచెల్, ఫిన్ అలెన్, లోకల్ ప్లేయర్ బెవాన్ జాకబ్స్ మినహా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత్‌ను నిలువరించే శక్తి కివీస్ లోపించినట్లు కనిపిస్తోంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

