Chess Olympiad | భారత్ స్వర్ణ చరిత్ర.. చెస్ ఒలింపియాడ్‌లో డబుల్ ధమాకా
ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల, మహిళల జట్లు సరికొత్త చరిత్రను లిఖించాయి. రెండు విభాగాల్లోనూ భారత్ అగ్రస్థానాన నిలిచి స్వర్ణాలు గెలుచుకుంది. బుడాపెస్ట్ వేదికగా జరిగిన 45వ చెస్ ఒలింపియాడ్ ఓపెన్ విభాగంలో దొమ్మరాజు గుకేశ్, ప్రజానంద రమేశ్‌బాబు, విదిత్ గుజరాతితో పాటు తెలంగాణ యువ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేసితో కూడిన భారత జట్టు 3.5-0.5తో స్లోవేనియాను ఓడించి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది.
- ఓపెన్, మహిళల విభాగాల్లో స్వర్ణాలు
Chess Olympiad | బుడాపెస్ట్ (హంగేరి): ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల, మహిళల జట్లు సరికొత్త చరిత్రను లిఖించాయి. రెండు విభాగాల్లోనూ భారత్ అగ్రస్థానాన నిలిచి స్వర్ణాలు గెలుచుకుంది. బుడాపెస్ట్ వేదికగా జరిగిన 45వ చెస్ ఒలింపియాడ్ ఓపెన్ విభాగంలో దొమ్మరాజు గుకేశ్, ప్రజానంద రమేశ్‌బాబు, విదిత్ గుజరాతితో పాటు తెలంగాణ యువ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేసితో కూడిన భారత జట్టు 3.5-0.5తో స్లోవేనియాను ఓడించి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. యూఎస్ఏ, ఉజ్బెకిస్థాన్ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. మహిళల విభాగంలో ద్రోణవల్లి హారిక, వైశాలి రమేశ్‌బాబు, దివ్య దేశ్‌ముఖ్, వంతిక అగర్వాల్ బృందం 3.5-0.5తో అజర్‌బైజాన్‌ను చిత్తు చేసింది. కజకిస్థాన్, యూఎస్ఏ రజతం, కాంస్యం గెలిచాయి. 97 ఏండ్ల ఈ టోర్నీ చరిత్రలో స్వర్ణం గెలవడం భారత్‌కు ఇదే ప్రథమం. మెన్స్ కేటగిరీలో 2014, 2022 ఎడిషన్లలో భారత్ కాంస్యం గెలవగా ఉమెన్స్ కేటగిరీలో 2022లో కాంస్యం దక్కడమే ఇప్పటిదాకా అత్యుత్తమ ప్రదర్శన. ఒక చెస్ ఒలింపియాడ్ ఈవెంట్లో ఒకే దేశానికి (ఓపెన్, ఉమెన్) రెండు స్వర్ణాలు రావడం ఈ టోర్నీ చరిత్రలో ఇది రెండోసారి మాత్రమే.
ఓటమన్నదే లేకుండా..
సుమారు 190 దేశాలు పోటీపడ్డ చెస్ ఒలింపియాడ్‌లో భాగంగా భారత్ అపజయమే లేకుండా టైటిల్‌ను గెలిచింది. 11 రౌండ్లు ఉండే ఈ టోర్నీలో భారత పురుషుల బృందం వరుసగా 8 రౌండ్లు గెలిచింది. 9వ రౌండ్‌ను (ఉజ్బెకిస్థాన్) డ్రా చేసుకోగా 10వ రౌండ్లో టాప్‌సీడ్ అమెరికాను ఓడించింది. 11 రౌండ్లకు గాను భారత్ ఖాతాలో 21 పాయిం ట్లు (రౌండ్‌కు 2) దక్కడం విశేషం. మహిళల జట్టూ వరుసగా 8 రౌండ్లు నెగ్గి 9వ రౌండ్‌ను డ్రా చేసుకుంది. తిరిగి 10, 11 రౌండ్లలో పైచేయి సాధించింది. 11 రౌండ్లలో అమ్మాయిలు 19 పాయింట్లు దక్కించుకున్నారు.
అద్భుతమైన ఆటతీరుతో 45వ చెస్ ఒలింపియాడ్‌ను భారత్ కైవసం చేసుకుంది. సరికొత్త స్వర్ణ అధ్యాయాన్ని లిఖించిన భారత పురుషుల, మహిళల బృందానికి హ్యాట్సాఫ్!
– కేటీఆర్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ATA bathukamma celebrations | ఆస్ట్రేలియా గడ్డపై అంగరంగ వైభవంగా.. 6 వేల మందితో మెల్బోర్న్ లో బతుకమ్మ వేడుకలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Suicide | పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
NHM Employees | ఉరి తాళ్లతో ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
Ambarkishore jha | బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల లక్ష్యం: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
ట్రెండింగ్ వార్తలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!

