Team India | భారత జట్టు జరిమానా విధించిన ఐసీసీ.. ఇంతకీ ఏం జరిగిందంటే..?
Team India | శ్రీలంక వేదికగా జరుగుతున్న ముక్కోణపు సిరీస్ తొలి మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణం టీమిండియా వుమెన్స్ జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) జరిమానా విధించింది. ఆదివారం కొలంబోలో జరిగిన ఈ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే.
Team India | శ్రీలంక వేదికగా జరుగుతున్న ముక్కోణపు సిరీస్ తొలి మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణం టీమిండియా వుమెన్స్ జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) జరిమానా విధించింది. ఆదివారం కొలంబోలో జరిగిన ఈ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. భారత జట్టుకు ఐసీసీ మ్యాచ్ ఫీజులో ఐదు శాతం జరిమానా విధించింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 రూల్‌ని ఉల్లంఘించిందని.. నిర్ణీత సమయంలో బౌలింగ్ చేయలేకపోవడంతో మ్యాచ్‌లో ఐదుశాతం జరిమానా విధించనున్నట్లు పేర్కొంది. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఇందుకు అంగీకరించిందని పేర్కొంది. ముక్కోణపు సిరీస్‌లోని రెండు మ్యాచుల్లో భారత జట్టు విజయం సాధించింది. ఆదివారం కొలంబోలో జరిగిన మ్యాచ్‌ను వర్షం కారణంగా 39 ఓవర్లకు కుదించారు.
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక మహిళల జట్టు 38.1 ఓవర్లలో 10 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఆ తర్వాత భారత జట్టు 29.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 149 పరుగులు చేసి మరో 56 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్‌ను నెగ్గింది. ఆఫ్ స్పిన్నర్ రాణా 31 పరుగులకు 3 వికెట్లు తీయగా.. ఎడమచేతి వాటం స్పిన్నర్ చరణిని 26 పరుగులు ఇచ్చి రెండు వికెట్ల పడగొట్టింది. సీనియర్ ఆఫ్ స్పిన్నర్ దీప్తి శర్మ కూడా 5.1 ఓవర్లలో 22 పరుగులకు రెండు వికెట్లు తీసింది. ముక్కోణపు సిరీస్‌లోని రెండో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను భారత జట్టు 15 పరుగుల తేడాతో ఓడించింది. మంగళవారం కొలంబోలో జరిగిన మ్యాచ్‌లో ప్రతీకా రావల్ అర్ధ సెంచరీ రాణించడంతో భారత్ 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా 49.2 ఓవర్లలో 261 పరుగులకు ఆలౌట్ అయింది. తాజ్మిన్ బ్రిట్స్ అత్యధికంగా 109 పరుగులు చేసింది. స్నేహ్ రాణా ఐదు వికెట్లు పడగొట్టగా, అరుంధతి రెడ్డి, శ్రీ చరణి, దీప్తి శర్మకు తలా ఒక వికెట్ దక్కింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

