భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డు సాధించాడు. టెస్టు క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో సౌతాఫ్రికా దిగ్గజ పేసర్ డేట్ స్టెయిన్‌ను దాటేశాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో అశ్విన్ ఈ రికార్డు బద్దలుకొట్టాడు.
అంతకుముందు కుశాల్ మెండిస్ (54) వికెట్‌తో డేట్ స్టెయిన్ వికెట్లను సమానం చేసిన అశ్విన్.. ఆ తర్వాత ధనంజయ డిసిల్వ (4)ను బోల్తా కొట్టించాడు. అశ్విన్ వేసిన బంతిని డిఫెండ్ చేయడానికి డిసిల్వ ప్రయత్నించాడు. కానీ శరీరానికి దూరంగా బ్యాటును ఉంచి డిఫెండ్ చేసుకున్నాడు.
దీంతో ఎడ్జ్ తీసుకున్న బంతి.. డిసిల్వ ప్యాడ్లను తాకి గాల్లోకి లేచింది. ఆ సమయంలో షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న హనుమ విహారి ఎడమ చేతి వైపు డైవ్ చేస్తూ చక్కని క్యాచ్ అందుకున్నాడు. దీంతో అశ్విన్ ఖాతాలో మరో వికెట్ చేరింది. శ్రీలంక జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.