ఆరంభంలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయినా కూడా సఫారీలు నిలకడగా ఆడుతున్నారు. సిరీస్ క్లీన్‌స్వీప్‌పై కన్నేసిన ప్రొటీస్.. మూడో వన్డేలో ధాటిగా ఆడుతున్నారు. ఓపెనర్ జానెమన్ మలాన్ (1) స్వల్పస్కోరుకే వెనుతిరిగడంతో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ టెంబా బవుమా (8) కూడా ఎక్కువ సేపు నిలవలేదు.
మలాన్‌ను చాహర్ పెవిలియన్ చేర్చాడు. అతని బౌలింగ్‌లోనే సూపర్ ఫీల్డింగ్‌తో బవుమాను రాహుల్ అవుట్ చేశాడు. దీంతో రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సఫారీలకు మరో ఓపెనర్, సీనియర్ బ్యాటర్ క్వింటన్ డీకాక్ (34 నాటౌట్) అండగా నిలబడ్డాడు.
అతనికి ఫామ్‌లేమితో బాధపడుతున్న ఎయిడెన్ మార్క్రమ్ (10 నాటౌట్) నుంచి సహకారం అందుతోంది. వీరిద్దరూ కలిసి నిలకడగా ఆడుతుండటంతో పది ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా జట్టు 53/2 స్కోరుతో పటిష్టంగా నిలిచింది.