భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో సెంచరీతో అదరగొట్టిన వెటరన్ ఓపెనర్ క్వింటన్ డీకాక్ (124) ఎట్టకేలకు పెవిలియన్ చేరాడు. భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వేసిన 36వ ఓవర్లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన డీకాక్.. శిఖర్ ధావన్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో డీకాక్ అద్భుతమైన ఇన్నింగ్స్‌కు తెరపడింది.
డీకాక్ అవుటవడంతో క్రీజులోకి డేవిడ్ మిల్లర్ వచ్చాడు. కాగా, డీకాక్‌కు చక్కటి సహకారం అందించిన రాసీ వాన్ డర్ డస్సెన్ (51 నాటౌట్) కూడా అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న అతను మరోసారి బ్యాటు ఝుళిపిస్తే సఫారీలు భారీ స్కోరు చేయడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.