Virat Kohli | ఫుల్ ఫామ్‌లో విరాట్ కోహ్లీ.. పాక్‌పై హాఫ్ సెంచరీ
Virat Kohli | పాక్‌తో జరుగుతున్న మ్యాచ్ టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 62 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. విరాట్‌కు ఇది వన్డేల్లో 74వ అర్ధ సెంచరీ. పాక్‌తో మ్యాచ్‌లో టీమిండియా విజయం వైపు దూసుకెళ్తున్నది.
Virat Kohli | పాక్‌తో జరుగుతున్న మ్యాచ్ టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 62 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. విరాట్‌కు ఇది వన్డేల్లో 74వ అర్ధ సెంచరీ. పాక్‌తో మ్యాచ్‌లో టీమిండియా విజయం వైపు దూసుకెళ్తున్నది. ప్రస్తుతం 27.1 ఓవర్లలో టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. విరాట్ 54, శ్రేయాస్ అయ్యర్ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు. విజయానికి టీమిండియా ఇంకా 103 పరుగులు చేయాల్సి ఉంది.
14వేల పరుగులు చేసిన విరాట్..
టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లీ వన్డేల్లో 14వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో వేగంగా 14వేల పరుగులు చేసిన క్రికెటర్‌గా ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. కోహ్లీ 287 వన్డే ఇన్నింగ్స్‌లో 14వేలు పూర్తి చేసి.. టీమిండియా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 15 పరుగుల వ్యక్తిగత స్కోర్ చేసి.. ఈ మైలురాయిని అందుకున్నాడు. హారిస్ రవూఫ్ బోలింగ్లో ఫోర్ కొట్టిన విరాట్.. టీమిండియా మాజీ ప్లేయర్ సచిన్, శ్రీలంక ఆటగాడు కుమార సంగక్కరను అధిగమించాడు. సచిన్ టెండూల్కర్ 350 వన్డేల్లో ఈ ఘనత సాధించాడు.
విరాట్ 287 వన్డేల్లోనే ఈ ఘనతను అందుకున్నాడు. వన్డేల్లో 14వేల కంటే ఎక్కువ పరుగులు చేసిన మూడో ఆటగాడిగా విరాట్ నిలిచాడు. వన్డేల్లో అత్యధిక పరుగులు పరుగులు చేసిన ప్లేయర్ సచిన్ రికార్డులకెక్కాడు. 463 వన్డేల్లో 44.8 సగటుత 18,426 పరుగులు చేశాడు. ఇందులో 49 సెంచరీలు, 96 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక శ్రీలంక ఆటగాడు కుమార సంగక్కర 404 వన్డేల్లో 42 సగటుతో 18,048 పరుగులు చేశాడు. ఇందులో 25 సెంచరీలు, 93 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. విరాట్ కోహ్లీ మొత్తం 299 మ్యాచుల్లో 57.8 సగటుతో 14వేల పరుగులు చేశాడు. ఇందులో 50 సెంచరీలు, 73 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

