IND vs NZ : లోకల్ బాయ్ సిరాజ్ హ్రాట్రిక్ మిస్సయ్యాడు. 46వ ఓవర్ నాలుగో బంతికి శాంటర్న్ను అవుట్ చేశాడు. ఆ తర్వాతి బంతికి షిష్లే వెనుదిరిగాడు. హ్రట్రిక్ బంతిని ఫెర్గూసన్ అడ్డుకున్నాడు. సిరాజ్ వేసిన షార్ట్ పిచ్ బంతికి క్యాచ్ ఇచ్చి శాంటర్న్ ఏడో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. అతను 45 బంతుల్లోనే 57 పరుగులు చేశాడు. బ్రేస్‌వెల్, శాంటర్న్ ఏడో వికెట్‌కు 102 బంతుల్లోనే 162 రన్స్ చేశారు. ప్రస్తుతం బ్రేస్‌వెల్, ఫెర్గూసన్ క్రీజులో ఉన్నారు. ఆ జట్టు విజయానికి 21 బంతుల్లో 48 రన్స్ కావాలి.