IND vs NZ : న్యూజిలాండ్ జట్టు మరింత కష్టాల్లో పడింది. 8 వికెట్లు కోల్పోయింది. ఫెర్గూసన్ వెనుదిరిగాడు. హార్ధిక్ పాండ్యా ఓవర్లో షాట్ ఆడబోయి క్యాచ్ ఔటయ్యాడు. అంతకుముందు శివం మావి ఒకే ఓవర్లో శాంటర్న్, సోధిని ఔట్ చేశాడు. దాంతో, 10 ఓవర్లకు ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 56 రన్స్ చేసింది. మిచెల్ (25) ఒక్కడే పోరాడుతున్నాడు. టిక్నర్ క్రీజులో ఉన్నాడు. ఆ జట్టు విజయానికి 60 బంతుల్లో 179 రన్స్ కావాలి.