IND vs NZ | తొలి వన్డేలో భారత్ గెలుపు.. 12 పరుగుల తేడాతో కివీస్ ఓటమి
మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి భారత్
IND vs NZ : ఉప్పల్ స్టేడియం హోరెత్తిపోయింది. భారత్, న్యూజిలాండ్ తొలి వన్డే క్రికెట్ ఫ్యాన్స్‌కు థ్రిల్లింగ్‌ను పంచింది. ఉత్కంఠభరిత మ్యాచ్‌లో టీమిండియా 12 తేడాతో గెలుపొందింది. చివరి ఓవర్లో 20 పరుగులు అవసరమైన దశలో బ్రేస్‌వెల్ తొలి బంతికే సిక్స్ కొట్టాడు. ఆ తర్వాతి బంతికి ఎల్బీగా ఔటయ్యాడు. దాంతో 337 రన్స్‌కు కివీస్ ఇన్నింగ్స్ ముగిసింది. భారత్ మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలుత శుభ్‌మన్ గిల్ సిక్సర్లతో విరుచుకుపడి డబుల్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత కివీస్ బ్యాటర్ మైఖేల్ బ్రేస్‌వెల్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. ఫోర్లు, సిక్సర్లు బాదుతూ శతకం బాదాడు. మ్యాచ్ చేజారినా కూడా అభిమానులకు కావాల్సినంత మజా దొరికింది. ఫిన్ అలెన్ (40) రాణించారు.
136 కే 6 వికెట్లు కోల్పోయిన కివీస్‌ను బ్రేస్‌వెల్, శాంటర్న్ ఆదుకున్నారు. వీళ్లిద్దరూ రికార్డు స్థాయిలో ఏడో వికెట్‌కు 162 రన్స్ చేశారు. అయితే.. చివర్లో లోకల్ బాయ్ సిరాజ్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి దెబ్బకొట్టాడు. అయితే.. హ్యాట్రిక్ మిస్సయ్యాడు. 46వ ఓవర్ నాలుగో బంతికి మరోసారి 4 వికెట్ల ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ను అవుట్ చేశాడు. ఆ తర్వాతి బంతికి షిష్లే వెనుదిరిగాడు. హ్రట్రిక్ బంతిని ఫెర్గూసన్ అడ్డుకున్నాడు. మరోసారి సిరాజ్ 4 వికెట్ల ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. కుల్దీప్, శార్దూల్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. షమీ, పాండ్యాకు ఒక్కో వికెట్ దక్కింది.
శుభ్‌మన్ డబుల్ సెంచరీ..
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 8 వికెట్ల నష్టానికి 349 రన్స్ చేసింది. ఓపెనర్ శుభ్‌మన్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. 145 బంతుల్లో రెండొందలు సాధించాడు. ఫోర్లు, సిక్సర్లతో కివీస్ బౌలర్లపై విరుచుకుపడిన అతను వన్డేల్లో తొలి ద్విశతకం బాదాడు. ఫెర్గూసన్ బౌలింగ్‌లో వరుసగా హ్యాట్రిక్ సిక్స్‌లు బాది డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 208 పరుగులకు గిల్ అవుట్ అయ్యాడు. వెనుదిరిగాడు. రోహిత్ శర్మ (34), విరాట్ కోహ్లీ (8), ఇషాన్ (5) స్వల్ప స్కోర్‌కే పెవిలియన్ చేరారు. భారత్ భారీ స్కోర్ చేసిందంటే అందుకు కారణం గిల్.. సూర్యకుమార్, పాండ్యాతో కలిసి హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నిర్మించాడు.
ధోనీ సరసన బ్రేస్‌వెల్..
సెంచరీతో చెలరేగిన బ్రేస్‌వెల్, భారత మాజీ కెప్టెన్ ధోనీ రికార్డును సమం చేశాడు. ధోనీ తర్వాత ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి రెండు సెంచరీలు బాదిన రెండో ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. అంతేకాదు న్యూజిలాండ్ తరఫున వేగవంతమైన సెంచరీ చేసిన మూడో ఆటగాడిగా నిలిచాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Sudheer Reddy | జైపాల్ రెడ్డిపై లేని ప్రేమంతా ఒలకబోస్తున్న రేవంత్ రెడ్డి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Road Accident | డివైడర్‌ను ఢీకొన్న బైక్.. ఇద్దరు మృతి
చెకుముకి సైన్స్ సంబురాలు-2026 పోస్టర్ ఆవిష్కరణ
Narnoor | గోవర్ధన్ గుట్టపై ఆదివాసుల సాంప్రదాయ పూజలు
Women Professor | వీసీ అల్డాస్ జానయ్య వేధింపులకు మరో మహిళా ప్రొఫెసర్ కంటతడి.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

