IND vs NZ ODI | టాస్ గెలిచిన భారత్.. కివీస్‌కు బ్యాటింగ్.. టీమిండియా తుది జట్టు ఇదే!
IND vs NZ ODI | భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి వన్డేకు రంగం సిద్ధమైంది. ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
IND vs NZ ODI | భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి వన్డేకు రంగం సిద్ధమైంది. ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా నిర్ణీత సమయానికి టాస్ వేయడం సాధ్యపడలేదు. వాతావరణం మెరుగుపడటంతో స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.50 గంటలకు (భారత కాలమానం ఉదయం 7.20 గంటలకు) టాస్ వేశారు. దీంతో మ్యాచ్ 10 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభం కానుంది. అయితే ఓవర్లలో ఎలాంటి కోత విధించలేదు.
నలుగురు పేసర్లతో భారత్
ఈ మ్యాచ్‌లో భారత జట్టు నలుగురు పేసర్లు, ఇద్దరు ఆల్‌రౌండర్లతో బరిలోకి దిగుతున్నది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టాస్ సందర్భంగా మాట్లాడుతూ.. వాతావరణం మేఘావృతంగా ఉండటంతో మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపాడు. 2027 వన్డే ప్రపంచకప్ సన్నాహకాల్లో ఈ సిరీస్ ఎంతో కీలకమని పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికా పరిస్థితులకు ఇక్కడి వాతావరణం, పిచ్ పరిస్థితులు దగ్గరగా ఉంటాయని అభిప్రాయపడ్డాడు. కాగా, భారత జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ వంటి కీలక ఆటగాళ్లకు చోటు దక్కింది. నలుగురు పేసర్లుగా అన్షుల్ కాంబోజ్, ఔకిబ్ నబీ, గుర్నూర్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్ ఆడనున్నారు. నమన్ ధీర్, అక్షర్ పటేల్ ఆల్రౌండర్లుగా జట్టులో ఉన్నారు.
కాన్వే స్థానంలో సీఫర్ట్
న్యూజిలాండ్ జట్టులో డెవాన్ కాన్వే గాయంతో తొలి వన్డేకు దూరమయ్యాడు. ప్రాక్టీస్ సమయంలో మాట్ హెన్రీతో ఢీకొని తలకు గాయమవడంతో విశ్రాంతి తీసుకుంటున్నాడు. అతడి స్థానంలో టిమ్ సీఫర్ట్ ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు. మార్క్ చాప్మన్, రచిన్ రవీంద్ర కూడా సిరీస్‌కు దూరంగా ఉన్నారు.
భారత్ తుది జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నమన్ ధీర్, అన్షుల్ కాంబోజ్, ఔకిబ్ నబీ, గుర్నూర్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్.
న్యూజిలాండ్ తుది జట్టు: టిమ్ సీఫర్ట్, విల్ యంగ్, హెన్రీ నికోల్స్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), నాథన్ స్మిత్, కైల్ జేమీసన్, జాకబ్ డఫీ, బ్లెయిర్ టిక్నర్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ ODI | టాస్ గెలిచిన భారత్.. కివీస్‌కు బ్యాటింగ్.. టీమిండియా తుది జట్టు ఇదే!
SIR | ఆధార్‌కు బదులు ఓటర్ ఐడీ.. సంక్షేమ పథకాల లబ్ధిదారులకు సర్ ఎసరు?
Walking | ట్రెడ్‌మిల్‌పై నడవడమా? పార్కుల్లో వాకింగా? ఏది బెటర్?
IND vs NZ ODI | భారత్-కివీస్ తొలి వన్డేకు వరుణుడి బ్రేక్.. వర్షంతో ఆలస్యమైన టాస్
IND vs NZ | ఇక వన్డే సవాల్.. రోకోపైనే అందరి చూపు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

