కొచ్చి : ఇండియన్ సూపర్ లీగ్‌లో హైదరాబాద్ ఎఫ్‌సీ ఎదురులేకుండా దూసుకుపోతోంది. ఆదివారం కేరళ ఎఫ్‌సీతో జరిగిన పోరులో హైదరాబాద్ 1-0తో విజయం సాధించింది. 29వ నిమిషంలో బొర్జ హెరెరా చేసిన ఏకైక గోల్‌తో హైదరాబాద్ గెలిచింది.
ఈ విజయంతో హైదరాబాద్ 42 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. బంతి ఎక్కువసేపు ప్రత్యర్థి అధీనంలో ఉన్నప్పటికీ హైదారబాద్ ఆటగాళ్లు తగిన సమయంలో గోల్ చేసి విజయాన్ని దక్కించుకున్నారు.