IPL 2024 | వీళ్లు క్రీజులోకొస్తే చుక్కలే.. ఐపీఎల్ ‘ఇంప్యాక్ట్ హీరో’లు మనోళ్లే
IPL 2024 : ఐపీఎల్ 17వ సీజన్లో అంచనా లెక్కలు తప్పుతుండగా.. ఉత్కంఠ పోరాటాలు అభిమానులను మునివేళ్లపై నిలబెడుతున్నాయి. ఆఖరి ఓవర్ థ్రిల్లర్లు, పవర్ హిట్టర్ల బ్యాటింగ్ విన్యాసాలు ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్నాయి.
IPL 2024 : ఐపీఎల్ 17వ సీజన్లో అంచనా లెక్కలు తప్పుతుండగా.. ఉత్కంఠ పోరాటాలు అభిమానులను మునివేళ్లపై నిలబెడుతున్నాయి. ఆఖరి ఓవర్ థ్రిల్లర్లు, పవర్ హిట్టర్ల బ్యాటింగ్ విన్యాసాలు ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్నాయి. కొందరు కుర్రాళ్లైతే ఒంటిచేత్తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేస్తున్నారు. ‘ఇంప్యాక్ట్ ప్లేయర్’ (Impact Player)గా మైదానంలోకి రావడమే ఆలస్యం ఆకలిగొన్న సింహంలా సిక్సర్ల వర్షం కురిపిస్తున్నారు. దొరికిన బంతిని దొరికినట్టు బౌండరీ దాటిస్తూ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు. క్రీజులో ఉన్నంతసేపు తుఫాన్‌లా విధ్వంసం సృష్టిస్తూ ప్రత్యర్థి జట్టును ఓటమి అంచుల్లోకి నెడుతున్నారు. పదిహేడో సీజన్లో ఇంప్యాక్ట్ సబ్స్గా మెరుపులు మెరిపిస్తున్న కుర్ర కెరటాలు వీళ్లే..
పదిహేడో సీజన్లో ఇరగదీస్తున్న కుర్ర కెరటాల్లో శివం దూబే(Shivam Dube) టాప్‌లో ఉన్నాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా క్రీజులోకి రావడమే ఆలస్యం ఎడాపెడా బౌండరీలతో చెలరేగుతున్నాడీ లెఫ్ట్ హ్యాండర్. పదహారో సీజన్లోనూ చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) తరుపుముక్కగా మారిన దూబే.. ఈ ఎడిషన్‌లోనూ సీఎస్కే విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. స్పిన్నర్లు, పేసర్లు.. బౌలర్ ఎవరైనా సరే ఉతుకుడే పరమావధిగా పెట్రేగిపోతున్నాడు.

ఇప్పటివరకూ ఆడిన ఆరు మ్యాచుల్లో దూబే 163.51 స్ట్రయిక్ రేటుతో 222 పరుగులు సాధించాడు. అతడి విధ్వసంక ఇన్నింగ్స్‌లో రెండు అర్థ శతకాలు ఉన్నాయి. గత మ్యాచ్‌లో వాంఖడేలో దూబే మరోసారి తన విశ్వరూపం ప్రదర్శించాడు. ముంబై ఇండియన్స్(Mumbai Indians) బౌలర్లను ఉతికారేస్తూ 38 బంతుల్లోనే 66 నాటౌట్‌తో చెన్నైకి కొండంత స్కోర్ అందించాడు. అతడి జోరు చూస్తుంటే టీ20 వరల్డ్ కప్ బృందానికి ఎంపికవ్వడం ఖాయమనిపిస్తోంది.
అశుతోష్ ఆడితే అరుపులే..
పంజాబ్ కింగ్స్ హిట్టర్ అశుతోష్ శర్మ(Ashutosh Sharma) ఈ సీజన్లో అనూహ్య రీతిలో చెలరేగిపోతున్నాడు. ఈ మధ్యప్రదేశ్ కుర్రాడు తన విధ్వంసంక బ్యాటింగ్‌తో బౌలర్ల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు. ఈ చిచ్చరపిడుగు 165.24 స్ట్రయిక్ రేటుతో ఏకంగా 233 రన్స్ బాదేశాడు. తొలుత గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)పై ఓటమి ఖాయమైన దశలో క్రీజలోకి వచ్చిన అశుతోష్ సిక్సర్ల మోత మోగించాడు. 17 బంతుల్లో 31 రన్స్ బాదిన అతడు శశాంక్ సింగ్‌తో కలిసి పంజాబ్‌ను గెలిపించాడు.

ఆ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కమిన్స్, నటరాజన్, భువనేశ్వర్ వంటి స్టార్ బౌలర్ల భరతం పడుతూ 15 బంతుల్లోనే 33 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. రాజస్థాన్ రాయల్స్‌పై కూడా రచ్చ చేశాడు. కేవలం 16 బంతుల్లోనే 31 రన్స్ బాదేసి జట్టుకు పోరాడగలిగే స్కోర్ అందించాడు.
17 బంతుల్లోనే అర్థ శతకం
పొట్టి క్రికెట్లో సంచలనమైన సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) ఐపీఎల్ 17వ సీజన్లో రఫ్ఫాడిస్తున్నాడు. ఆలస్యంగా జట్టుతో కలిసిన సూర్య.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB)పై రెప్పపాటులోనే మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. సూర్య ఇంప్యాక్ట్ ప్లేయర్‌గా క్రీజులోకి వచ్చి 17 బంతుల్లోనే అర్థ శతకం బాదేసి ముంబైని గెలుపు వాకిట నిలిపాడు.

ఆ మ్యాచ్‌లో మెరుపు బ్యాటింగ్‌తో అలరించిన ఈ మిస్టర్ 360.. టీ20ల్లో 7 వేల పరుగుల క్లబ్లో చేరాడు. అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన నాలుగో భారత క్రికెటర్‌గా సూర్య రికార్డు నెలకొల్పాడు. చెన్నై సూపర్ కింగ్స్‌పై డకౌట్‌గా వెనుదిరిగినా.. తర్వాతి మ్యాచుల్లో ముంబైకి కొండంత అండలా నిలవడం ఖాయం.
సుదర్శన్ @ సుడిగాలి ఇన్నింగ్స్‌లు
పదిహేడో సీజన్లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా సాయి సుదర్శన్(Sai Sudarshan) దుమ్మురేపుతున్నాడు. పదహారో సీజన్ ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్‌పై 95 పరుగులతో చెలరేగిన గుజరాత్ టైటాన్స్ యువకెరటం గుజరాత్ టైటాన్స్ టాపార్డర్‌లో కీలక ఆటగాడు.

బక్కపలచగా కనిపించే సుదర్శన్ సుడిగాలి ఇన్నింగ్స్‌లు ఆడడంలో దిట్ట. మూడో స్థానంలో వచ్చి.. చివరి వరకూ ఇన్నింగ్స్ నిర్మిస్తూ గుజరాత్ విజయాల్లో భాగమవుతున్నాడు. గుజరాత్ గెలుపొందిన మూడు మ్యాచుల్లో సాయి మెరుపులు మెరిపించాడు. ముంబైపై 45 పరుగులు, హైదరాబాద్‌పై 45, రాజస్థాన్‌పై 31 పరుగులతో సత్తా చాటాడు. ఈ లెఫ్ట్ హ్యాండర్ ఇప్పటికే ఆరు మ్యాచుల్లో 226 రన్స్ బాదాడు.
మోహిత్ ఒక్కడే..
ఇంప్యాక్ట్ ప్లేయర్‌గా కుర్రాళ్లతో పోటీ పడుతూ రాణిస్తున్న పేసర్ మోహిత్ శర్మ(Mohit Sharma). ప్రధాన పేసర్ షమీ(Mohammad Shami) అందుబాటులో లేకున్నా ఈ వెటరన్ పేసర్ అద్భుతంగా రాణిస్తున్నాడు. తన అనుభవాన్ని ఉపయోగిస్తూ కీలక సమయాల్లో వికెట్లు తీస్తున్న మోహిత్ గుజరాత్ గెలుపు గుర్రంగా మారాడు. ఈ రైట్ ఆర్మ్ పేసర్ 6 మ్యాచుల్లో 8 వికెట్లతో సత్తా చాటాడు.

ఇవి కూడా చదవండి
- Sumit Nagal | రాకెట్‌తో సంచలనం.. నగాల్‌కు కెరీర్ అత్యుత్తమ ర్యాంక్
- Aa Okkati Adakku | కొత్త విడుదల తేదీ ప్రకటించిన అల్లరి నరేష్ ‘ఆ ఒక్కటీ అడక్కు’
- Weather | వాతావరణ శాఖ చల్లని కబురు.. ఈ ఏడాది వర్షపాతం ఎక్కువే
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

