Aa Okkati Adakku | అల్లరి నరేశ్ (Allari Naresh) కథానాయకుడిగా వస్తున్న తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమాకు మల్లి అంకం దర్శకత్వం వహిస్తుండగా.. ఫరియా అబ్దుల్లా(Faria Abdulla) కథనాయికగా నటిస్తుంది. వెన్నెల కిశోర్, వైవా హర్ష తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు గ్లింప్స్ విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ రిలీజ్ అప్డేట్ ఇచ్చారు.
మొదట ఈ సినిమాను మార్చి 22 న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పోస్ట్ ప్రోడక్షన్ పనులు కంప్లీట్ కాకపోవడం.. పెద్ద సినిమాలు విడుదల ఉండడంతో విడుదలను వాయిదా వేసుకుంది. ఇప్పుడు తాజాగా మరో విడుదల తేదీని ప్రకటించింది. ఈ సినిమాను వేసవి కానుకగా మే 03న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించింది. చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక ఈ సినిమాను నిర్మిస్తుండగా.. వెన్నెల కిషోర్, జామీ లివర్, వైవా హర్ష, అరియానా గ్లోరీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు రచయిత – అబ్బూరి రవి, ఎడిటర్ – చోటా కె ప్రసాద్, డోప్ – సూర్య, సంగీత దర్శకుడు – గోపీ సుందర్.
#AaOkkatiAdakku Worldwide Grand Release on May 3rd
– https://t.co/Cki4mPaXkB #AOAonMay3rd pic.twitter.com/S9Js5YRyJb
— Vamsi Kaka (@vamsikaka) April 15, 2024