Mohammad Kaif | బుమ్రా ఆడకపోతే ప్రపంచకప్‌లో ఓటమే..! టీమిండియా మాజీ స్టార్ మహ్మద్ కైఫ్
Mohammad Kaif | ఈ నెలలో ఐర్లాండ్ భారత జట్టు మూడు మ్యాచుల టీ20 సిరీస్ ఆడనున్నది. ఈ సిరీస్‌తో టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా జాతీయ జట్టులోకి తిరిగిరానున్నాడు. ఈ సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. దాంతో దృష్టి బుమ్రాపైనే పడింది.
Mohammad Kaif | ఈ నెలలో ఐర్లాండ్ భారత జట్టు మూడు మ్యాచుల టీ20 సిరీస్ ఆడనున్నది. ఈ సిరీస్‌తో టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా జాతీయ జట్టులోకి తిరిగిరానున్నాడు. ఈ సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. దాంతో దృష్టి బుమ్రాపైనే పడింది. అయితే, బుమ్రా అనుభవం జట్టుకు చాలా కీలకమని భారత మాజీ స్టార్ బ్యాట్స్‌మెన్ మహ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డాడు. అతను ఆడకపోతే 2022లో జరిగిన ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్‌లో ఏం జరిగిందో వచ్చే వరల్డ్ కప్‌లో అదే జరుగుతుందన్నాడు. ఆసియా కప్‌లో భారత జట్టు సూపర్ ఫోర్ రౌండ్లో వెనుదిరుగగా.. టీ20 ప్రపంచ కప్‌లో సెమీస్ ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. భారత్‌కు రెండుమూడు జట్లను దించే సత్తా ఉందని, అయితే బౌలింగ్‌లో అంత డెప్త్ లేదని కైఫ్ పేర్కొన్నాడు.
ప్రస్తుతం గాయపడ్డ వారంతా ప్రపంచకప్‌లో భారతకు కీలకమైన కీలకమైన ఆటగాళ్లని కైఫ్ తెలిపాడు. బుమ్రా పునరాగమనంపైనే టీమిండియా ఆశలున్నాయని, చాలాకాలం తర్వాత బుమ్రా మళ్లి జట్టులోకి వస్తుండగా.. ఎంత ఫిట్‌గా ఉన్నాడో బరిలోకి దిగితే గానీ తెలియదు. స్వదేశంలో జరిగే ప్రపంచకప్‌లో రాణించాలంటే భారత్‌కు పూర్తి ఫిట్‌గా ఉన్న బుమ్రా అవసరమని కైఫ్ పేర్కొన్నారు. బుమ్రా వరల్డ్‌కప్ ఆడకపోతే ఈ టోర్నీలో టీమిండియా ఓటమిపాలయ్యే ఛాన్స్ ఉంటుందని, 2022 ఆసియాకప్, టీ20 వరల్డ్ కప్ ఫలితమే పునరావృతమవుతుందని పేర్కొన్నారు. బుమ్రా ప్లేస్‌లో బ్లాకప్ లేదని, ప్రస్తుతం భారత జట్టు బలంగా కనిపించడం లేదని కైఫ్ పేర్కొన్నారు. కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ వంటి కీలకమైన ఆటగాళ్లు గాయాల కారణంగా జట్టుకు దూరం కావడంతో ప్రస్తుతం టీమిండియా బలహీనంగా కనిపిస్తోందని కైఫ్ పేర్కొన్నాడు.
అయితే, ప్రపంచకప్‌లోకి రిజర్వ్ కీపర్‌గా ఇషాన్ కిషన్‌ను తీసుకోవాలని కైఫ్ జట్టు మేనేజ్మెంట్కు సూచించాడు. ఇప్పటి వరకు ఇషాన్ ఆటతీరు బాగానే ఉందని చెప్పాడు. ఇషాన్, సూర్యకుమార్, సంజు శాంసన్, శ్రేయాస్ అయ్యర్‌లో ఎవరు 15 మంది సభ్యుల ప్రపంచకప్ జట్టులో ఉంటారో తెలియనది, కేఎల్ రాహుల్ ప్రపంచకప్ ఆడితే.. బ్యాకప్ వికెట్ కీపర్ ఎవరు చూసుకోవాలని, ఇషాన్ కిషన్‌ను బ్యాకప్‌గా తీసుకోవాలని చెప్పాడు. టీమిండియా క్వార్టర్స్‌కు అర్హత సాధిస్తుందని కైఫ్ అభిప్రాయపడ్డాడు. సెమీ ఫైనల్ నుంచి టీమిండియాకు కష్టంగా సవాల్‌గా ఉంటుందని, ప్రపంచకప్ టైటిల్‌ను గెలవాలంటే రెండు కీలకమైన మ్యాచ్‌లను గెలవాల్సి ఉంటుందని కైఫ్ అభిప్రాయపడ్డాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

