Women World Cup | జగజ్జేతగా ఆస్ట్రేలియా.. ఏడోసారి ప్రపంచకప్ సొంతం
క్రిస్ట్‌చర్చ్ : మహిళల వరల్డ్ కప్ విజేతగా ఆస్ట్రేలియా నిలిచింది. 71 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను మట్టికరిపించి ఏడోసారి టైటిల్‌ను ఎగరేసుకొనిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 356 పరుగులు చేసింది. మహిళల క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్లో ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. ఆ తర్వాత భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు తడబడి.. ఓటమిపాలైంది. వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్ – ఆస్ట్రేలియా జట్లు తలపడడం ఇది నాల్గోసారి. ఇంతకు ముందు 1978, 1982, 1988లో వరుసగా మూడుసార్లు మహిళ ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా ఫైనల్లో ఇంగ్లాండ్‌ను ఓడించింది.
ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్‌ను ఎంచుకున్నది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఐదు వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ 43.5 ఓవర్లలో 285 పరుగులకు ఆలౌటై.. ఆస్ట్రేలియా 71 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇంగ్లాండ్ జట్టులో నాటలీ స్కివర్ 121 బంతుల్లో 148 (నాటౌట్) పరుగులతో నిలిచింది. స్కీవర్ ఒంటరి ప్రయత్నం చేసినా.. మిగతా బ్యాటర్ల నుంచి సహకారం లేకపోవడంతో ఓటమి తప్పలేదు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసినా ఆస్ట్రేలియాకు ఓపెనర్లు శుభారంభం అందించారు. అలిస్సా హీలీ, రాచెల్ హేన్స్ తొలి వికెట్‌కు 160 పరుగులు జోడించారు.
ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఇదే అతిపెద్ద భాగస్వామ్యం. ఆ తర్వాత మూనీతో కలిసి హీలీ 156 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించింది. ఇది కూడా ప్రపంచకప్ ఫైనల్లో రెండో అత్యధిక భాగస్వామ్యం. హీలీ 138 బంతుల్లో 170 పరుగులు సాధించింది. 26 బౌండరీలో బాదింది. నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ తరఫున ష్రూబ్సోల్ మూడు వికెట్లు పడగొట్టింది. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న ఇంగ్లాండ్ జట్టు బౌలర్లు రాణించలేకపోయారు. ఫైనల్ మ్యాచ్‌లో 29 ఓవర్ వరకు ఇంగ్లాండ్ బౌలర్లు ఒక్క వికెట్‌ను తీయలేకపోయారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

