ICC Player Of The Month | ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు రేసులో శుభ్‌మన్ గిల్, సిరాజ్
భారత యంగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్, ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు రేసులో నిలిచారు. జనవరి నెలకు గానూ టీమిండియా నుంచి వీళ్లిద్దరూ నామినేట్ అయ్యారు. న్యూజిలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వే కూడా పోటీలో ఉన్నాడు.
ICC Player Of The Month : భారత యంగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్, ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు రేసులో నిలిచారు. జనవరి నెలకు గానూ టీమిండియా నుంచి వీళ్లిద్దరూ నామినేట్ అయ్యారు. న్యూజిలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వే కూడా పోటీలో ఉన్నాడు. జనవరిలో 11 వన్డేలు ఆడిన శుభ్‌మన్ 643 రన్స్ చేశాడు. శ్రీలంక, న్యూజిలాండ్ సిరీస్‌లో శుభ్‌మన్ గిల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. శ్రీలంకపై మూడో వన్డేలో సుడిగాలి ఇన్నింగ్స్ ఆడిన అతను కెరీర్లో తొలి డబుల్ సెంచరీ కొట్టాడు. అంతేకాదు కివీస్‌పై ఆఖరి టీ20లో సెంచరీ బాదాడు. దాంతో, మూడు ఫార్మాట్లలో శతకం చేసిన అతిచిన్న వయస్కుడైన(23) భారత క్రికెటర్‌గా శుభ్‌మన్ రికార్డు సాధించాడు.
14 వికెట్లతో..
వన్డేల్లో నంబర్ వన్ ర్యాంకు బౌలర్ సిరాజ్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ రేసులో ఉన్నాడు. జనవరిలో అతను 14 వికెట్లు తీశాడు. శ్రీలంక, న్యూజిలాండ్ సిరీస్‌లో అతను కీలక వికెట్లు పడగొట్టాడు. రెండు సార్లు నాలుగు వికెట్లు తీశాడు. జనవరిలో 9 మ్యాచులు ఆడిన కాన్వే 493 రన్స్ చేశాడు. వీటిలో ఒక సెంచరీ కూడా ఉంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

