ICC ODI Rankings | ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో 2వ స్థానానికి విరాట్.. ఆధిపత్యం కొనసాగించిన రోహిత్..!
ICC ODI Rankings | ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆధిపత్యం కొనసాగించారు. ఐసీసీ బుధవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ రెండో స్థానానికి చేరుకున్నారు. ఇప్పటికే నెంబర్ వన్ బ్యాట్స్‌మెన్‌గా కొనసాగుతున్న రోహిత్ శర్మ.. తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు.
ICC ODI Rankings | ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆధిపత్యం కొనసాగించారు. ఐసీసీ బుధవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ రెండో స్థానానికి చేరుకున్నారు. ఇప్పటికే నెంబర్ వన్ బ్యాట్స్‌మెన్‌గా కొనసాగుతున్న రోహిత్ శర్మ.. తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో విరాట్ కోహ్లీ అద్భుతంగా బ్యాటింగ్ చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. దాంతో రన్ మిషన్ ర్యాంకు గణనీయంగా మెరుగుపడింది.
ప్రస్తుతం నెంబర్ వన్ ప్లేస్‌ను చేరుకునేందుకు విరాట్ కోహ్లీ.. అగ్రస్థానానికి చేరుకునేందుకు కేవలం ఎనిమిది రేటింగ్ పాయింట్ల దూరంలో ఉన్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచుల్లో 302 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ ఉన్నది. సిరీస్‌లోని చివరి వన్డేలో కోహ్లీ అజేయంగా 65 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దాంతో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో రెండుస్థానాలు మెరుగుపరుచుకొని రెండో ప్లేస్‌కు చేరుకున్నాడు.
మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ వన్డేల్లో స్థిరంగా రాణిస్తూ తన నెంబర్ వన్ ప్లేస్‌ను నిలబెట్టుకున్నాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో 146 పరుగులు చేశాడు. కోహ్లీ, రోహిత్ ఇద్దరు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్-2 ప్లేసుల్లో నిలిచారు. టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఐదో స్థానంలో ఉన్నాడు. మరో బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ ఒక ర్యాంకు దిగజారి 10వ స్థానానికి చేరుకున్నాడు. కేఎల్ రాహుల్ రెండు స్థానాలను మెరుగుపరుచుకొని 12వ ప్లేస్‌కు చేరాడు. ఇక బౌలింగ్ ర్యాంకుల్లో కుల్దీప్ యాదవ్ మూడు ర్యాంకులు మెరుగుపరుచుకొని మూడోస్థానంలో నిలిచాడు.
టెస్ట్ ర్యాంకుల్లో టీమిండియా బ్యాట్స్‌మెన్ యశస్వీ జైస్వాల్ మాత్రమే ఎనిమిది స్థానంలో నిలువగా.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 11వ స్థానం, రిషబ్ పంత్ 13వ స్థానాలకు చేరుకున్నారు. టెస్ట్ బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా నెంబర్ వన్ ప్లేస్‌ని నిలబెట్టుకున్నాడు. ఆ తర్వాత మహమ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ ఒక్కో స్థానాన్ని మెరుగుపరుచుకొని వరుసగా 12వ, 13వ, 14వ స్థానాల్లో నిలిచారు.
అదే సమయంలో దక్షిణాఫ్రికా బ్యాటర్లు క్వింటన్ డి కాక్, ఐడెన్ మార్క్రమ్, టెంబా బావుమా సైతం తమ ర్యాంకులను మెరుగుపరుచుకున్నారు. అదే సమయంలో యాషెస్‌లో రెండు మ్యాచ్‌ల్లో 18 వికెట్లు తీసిన ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో మూడోస్థానానికి ఎగబాకాడు. పేలవమైన బ్యాటింగ్ కారణంగా హ్యారీ బ్రూక్ నాల్గో ప్లేస్‌కు పడిపోయాడు. కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్ ఒక్కొక్క స్థానం మెరుగుపరుచుకున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | శ్రీవారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం
Kanpur Accident: థార్ వాహనంతో స్కూటర్‌ను ఢీకొట్టిన మహిళ.. కాన్పూర్ ఘటనలో ఒకరు మృతి
Auto | చెట్లు నాటి తిరిగొస్తుండగా.. టిప్పర్‌ను ఢీకొట్టిన కూలీల ఆటో
DADA | డిసెంబర్ 24న దాదా ధమాకా.. నవంబర్ 13న ఫస్ట్ సాంగ్, థమన్ మ్యూజిక్‌తో టాలీవుడ్లో భారీ హైప్!
iQOO | 10,000mAh బ్యాటరీతో iQOO కొత్త ఫోన్.. 7 ఇంచుల భారీ డిస్ప్లే కూడా!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

