ICC T20I Team Of The Year 2023: మిస్టర్ 360కి అరుదైన గౌరవం.. గతేడాది బెస్ట్ టీమ్‌లో నలుగురు భారతీయులే..
ICC T20I Team Of The Year 2023: గతేడాది టీ20 ఫార్మాట్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లను ఎంచి ప్రకటించిన ఐసీసీ టీ20 టీమ్ ఆఫ్ ది ఈయర్‌లో నలుగురు భారత ఆటగాళ్లే ఉండగా ఈ జట్టుకు సూర్యకుమార్ యాదవ్‌ను సారథిగా ఎంపిక చేసింది.
ICC T20I Team Of The Year 2023: భారత క్రికెట్ జట్టు టాప్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌కు అరుదైన గౌరవం దక్కింది. గతేడాది టీ20 ఫార్మాట్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లను ఎంచి ప్రకటించిన ఐసీసీ టీ20 టీమ్ ఆఫ్ ది ఈయర్‌లో నలుగురు భారత ఆటగాళ్లే ఉండగా ఈ జట్టుకు సూర్యకుమార్ యాదవ్‌ను సారథిగా ఎంపిక చేసింది. సూర్యతో పాటు యశస్వి జైస్వాల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్‌లు చోటు దక్కించుకోవడం గమనార్హం.
సోమవారం కొద్దిసేపటిక్రితమే ప్రకటించిన ఈ జట్టులో ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, ఫిల్ సాల్ట్ (ఇంగ్లండ్)ను ఓపెనర్లుగా ఎంపికచేసింది. వన్‌డౌన్‌లో విండీస్ వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్ ఉండగా నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. ఆ తర్వాత మార్క్ చాప్మన్ (న్యూజిలాండ్), సికందర్ రజా (జింబాబ్వే), అల్పేష్ రంజానీ (ఉగాండా), మార్క్ అడైర్ (ఐర్లాండ్), రవి బిష్ణోయ్ (ఇండియా), రిచర్డ్ ఎంగర్వ (జింబాబ్వే), అర్ష్‌దీప్ సింగ్ (ఇండియా)లు జాబితాలో ఉన్నారు.
యశస్వి జైస్వాల్ గతేడాదే భారత జట్టులోకి వచ్చినా టీ20లలో తనదైన మెరుపు ఆటతో ఐసీసీ టీమ్ ఆఫ్ ది ఈయర్‌లో చోటు దక్కించుకోవడం గమనార్హం. ఇక పొట్టి క్రికెట్ అంటేనే పూనకం అచ్చినట్టుగా ఆడే సూర్య.. గతేడాది హార్ధిక్ పాండ్యా గైర్హాజరీలో ఆస్ట్రేలియా సిరీస్‌లో సారథిగానూ నడిపించాడు. బిష్ణోయ్ స్పిన్నర్‌గా అంచనాలకు మించి రాణిస్తుండగా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్.. ఈ ఫార్మాట్లో అవకాశం వచ్చినప్పుడల్లా రాణిస్తున్నాడు.
India’s white-ball dynamo headlines the ICC Men’s T20I Team of the Year for 2023 🔥
Check out who made the final XI 👇https://t.co/QrQKGYbmu9
— ICC (@ICC) January 22, 2024
ఐసీసీ టీ20 టీమ్ ఆఫ్ ది ఈయర్ 2023: యశస్వి జైస్వాల్, ఫిల్ సాల్ట్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), మార్క్ చాప్మన్, సికందర్ రజా, అల్పేష్ రంజానీ, మార్క్ అడైర్, రవి బిష్ణోయ్, రిచర్డ్ ఎంగర్వ, అర్ష్‌దీప్ సింగ్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

