హైదరాబాద్, ఆట ప్రతినిధి : ఏపీ, తెలంగాణ రీజియన్ సీఐఎస్సీఈ గేమ్స్, స్పోర్ట్స్ లెవెల్ జిమ్నాస్టిక్స్‌లో హైదరాబాద్ జిమ్నాస్ట్ మాన్య జోయ్స్ 4 స్వర్ణాలతో సత్తా చాటింది. హైదరాబాద్‌లో సోమవారం జరిగిన పోటీల్లో మాన్య అండర్-14 విభాగం హూప్, బాల్, క్లబ్స్, రిబ్బన్ ఆపరేటస్ పోటీల్లో విజేతగా నిలిచింది.
రిథమిక్ ఆల్‌రౌండ్ విభాగంలో టాప్ ప్లేస్ సాధించి నేషనల్స్‌కు కూడా ఎంపికైంది. మరో జిమ్నాస్ట్ నైషా హూబ్, బాల్ ఆపరేటస్ పోటీల్లో రజతాలు కైవసం చేసుకుంది.