హైదరాబాద్, ఆట ప్రతినిధి: మహిళల సీనియర్ ఇంటర్‌జోన్ టీ20 ట్రోఫీలో భాగంగా సౌత్‌జోన్ టీమ్‌కు హైదరాబాద్ క్రికెటర్లు గొంగడి త్రిష, బూగి శ్రావణి ఎంపికయ్యారు. ఈ నెల 24 నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకు లక్నో వేదికగా జరిగే టోర్నీలో వీరిద్దరు సౌత్‌జోన్ తరఫున బరిలోకి దిగనున్నారు. శుక్రవారం గోవాలో సమావేశమైన సౌత్‌జోన్ అసోసియేషన్ సెలెక్టర్లు జట్టును ఎంపిక చేశారు.
అండర్-19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యురాలైన త్రిష దూకుడుగా బ్యాటింగ్ చేయడంలో దిట్టగా పేరొంది. ప్రత్యర్థి బౌలర్లను లక్ష్యంగా చేసుకుంటూ పరుగులు సాధించడంలో త్రిష సఫలమవుతున్నది. పరిస్థితులకు అనుగుణంగా తన బ్యాటింగ్ శైలిని మార్చుకుంటూ ముందుకెళుతున్నది. మరోవైపు బౌలింగ్‌లో శ్రావణి అదరగొడుతున్నది. సౌత్‌జోన్ టీమ్‌కు శిఖాపాండే కెప్టెన్‌గా, మినుమణి వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు.