HS Prannoy | తైపీ ఓపెన్‌లో ప్రణయ్ దూకుడు.. క్వార్టర్ ఫైనల్లో కాలు మోపాడు
HS Prannoy : భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్(HS Prannoy) ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఈమధ్యే మలేసియా మాస్టర్స్ సూపర్ 500( Malaysia Masters super 500) టైటిల్ గెలిచిన అతను తైపీ ఓపెన్(Taipei Open) క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. 2014 వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం నెగ్గిన టామీ సుగియర్టో(Tommy Sugiarto)పై...
HS Prannoy : భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్(HS Prannoy) ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఈమధ్యే మలేసియా మాస్టర్స్ సూపర్ 500( Malaysia Masters super 500) టైటిల్ గెలిచిన అతను తైపీ ఓపెన్(Taipei Open) క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. 2014 వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం నెగ్గిన టామీ సుగియర్టో(Tommy Sugiarto)పై 21-9, 21-17తో గెలుపొందాడు. మొదటి సెట్లో ఇండోనేషియా ప్రత్యర్థి నుంచి పెద్దగా ప్రతిఘటన ఎదురవ్వలేదు.
కానీ, రెండో గేమ్‌లో భారత షట్లర్ 4-0తో వెనకబడ్డాడు. అలాగని ఒత్తిడికి లోనవ్వలేదు. అనూహ్యంగా పుంజుకకుని 21-17తో సెట్ గెలుచుకున్నాడు. కేవలం 36 నిమిషాల్లోనే మ్యాచ్ ముగించాడు. సెమీస్ పోరులో అతను ఐదోసీడ్ హాంకాంగ్‌కు చెందిన అంగుస్ కా లాంగ్(Angus Ng Ka Long)ను ఢీ కొట్టనున్నాడు.
కశ్యప్ ఔట్
మరో భారత ఆటగాడు పారుపల్లి కశ్యప్(Parupalli Kashyap) ఓటమితో నిష్క్రమించాడు. సూ లీ యాంగ్(Su Li Yang) 16-21, 17-21తో అతడిపై గెలుపొందాడు. దాంతో, ఈ టోర్నీలో భారత్ నుంచి ప్రణయ్ ఒక్కడే మిగిలాడు. ఈ ఏడాది జోరు మీదున్న ప్రణయ్ ఇండోనేషియా ఓపెన్‌లోనూ సత్తా చాటాడు. సెమీఫైనల్ వరకు వెళ్లాడు. కానీ, వరల్డ్ నంబర్ 1 విక్టర్ అక్సెల్సెన్ చేతిలో ఓటమిపాలయ్యాడు. దాంతో, 7వ ర్యాంక్ నుంచి 9వ ర్యాంక్‌కు పడిపోయాడు.
ఇవి కూడా చదవండి
Neeraj Chopra | నీరజ్ చోప్రా ఫిట్.. డైమండ్ లీగ్ పోటీల్లో బరిలోకి
Neymar Jr | తండ్రి కాబోతున్న బ్రెజిల్ స్టార్ ఫుట్‌బాలర్.. క్షమించమంటూ ప్రేయసిని వేడుకున్నాడు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

