Neeraj Chopra Workout : నీరజ్ చోప్రా ‘పసిడి’ రహస్యమిదే..?!
Neeraj Chopra Workout : అత్యంత దూరం జావెలిన్ విసిరిన నీరజ్ చోప్రా.. భారతదేశం సగర్వంగా తలెత్తుకునేలా చేశాడు. అత్యధిక దూరం విసరడంతో పతకం ఖాయం చేసుకున్న నీరజ్.. ఈ పతకాన్ని తన మెడలో ధరింపజేసుకునేందుకు ...

టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో విభాగంలో నీరజ్ చోప్రా (Neeraj Chopra Workout) పసిడి పతకం సాధించడం ఆశామాషీగా జరుగలేదు. దీని వెనుక కఠోర శ్రమ, సాధించాలన్న పట్టుదల, తానేంటో ప్రపంచానికి చాటాలన్న కసి దాగున్నాయి. అందుకే పెద్దలు అంటుంటారు ‘కృషితో నాస్తి దుర్భిక్షం’ అని. ఏ కార్యం సిద్ధించాలన్నా, నెరవేర్చాలన్నా ‘సాధన’ అన్నింటికన్నా ముఖ్యం. అలాగే, ‘సాధనమున పనులు సమకూరు ధరలోని’ అని కూడా చెప్తుంటారు. అంటే సాధన చేయడం ద్వారానే అనుకున్నది సాధించవచ్చు. వీటికి గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా చక్కటి ఉదాహరణగా నిలుస్తాడని చెప్పవచ్చు.

అత్యంత దూరం జావెలిన్ విసిరిన నీరజ్ చోప్రా.. భారతదేశం సగర్వంగా తలెత్తుకునేలా చేశాడు. అత్యధిక దూరం విసరడంతో పతకం ఖాయం చేసుకున్న నీరజ్.. ఈ పతకాన్ని తన మెడలో ధరింపజేసుకునేందుకు చాలా కష్టపడ్డాడు. నీరజ్ బంగారు పతకం సాధించగానే సోషల్‌మీడియాలో ఆయన సాధన వీడియోలు ఒక్కసారిగా ప్రత్యక్ష్యమయ్యాయి. ఇవి ఆయన ఎంతటి కఠోర శ్రమ చేశాడో చెప్తున్నాయి. తెల్లవారక ముందే భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంకు వెళ్లడం, సాధన చేయడం.. తిరిగి సాయంత్రం ఇదే మైదానానికి రావడం.. మళ్లీ సాధనలో మునిగిపోవడం ఆయన నిత్యకృత్యం. శరీరాన్ని తేలికగా చేసుకోవడం ద్వారానే మంచి అథ్లెట్‌గా తయారవ్వొచ్చని తన గురువులు చేసిన ఉపదేశాన్ని తూచా తప్పక పాటించాడు. ఒక్క జావెలిన్ త్రోలో గెలువడం కోసం హార్డిల్స్ క్రీడాకారుడిగా, వెయిట్‌లిఫ్టర్‌గా, బాడీబుల్డర్గా.. ఇలా ఎన్నో అవతారాలెత్తాల్సి వచ్చింది. అత్యంత కఠినమైన ‘డ్రాగన్ ఫ్లాగ్’ చేయడంలో ధిట్ట అనిపించుకున్నాడు. గాలిలో ఎగిరి రెండు కాళ్లను 90 డిగ్రీల్లో ఉంచడం ప్రక్రియే ‘డ్రాగన్ ఫ్లాగ్’. దీనిని సాధించాలంటే ఎంతో కఠినమైన సాధన చేయాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి..
శ్రీనగర్‌లో రాహుల్‌గాంధీ పర్యటన
అంతరిక్షంలో వరుడు.. టెక్సాస్‌లో వధువు.. వీడియో కాల్లో పెండ్లి
డయాబెటిస్ చికిత్సలో ‘స్మార్ట్’ ఇన్సులిన్
రక్తంలో షుగర్ నియంత్రణకు కృత్రిమ క్లోమం
రెండో సెషన్ ఐపీఎల్ కోసం కొత్త నిబంధన.. అదేంటంటే..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

