Shai Hope | వరసగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు.. ‘అమ్మో.. ఇన్ని ఎలా?’ అని తలపట్టుకున్న విండీస్ కెప్టెన్..!
Shai Hope : భారత గడ్డపై శతకాలతో హోరెత్తిస్తున్న షాహ్ హోప్ (Shai Hope).. వన్డేల్లోనే కాదు పొట్టి క్రికెట్లోనూ 'మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'(Player Of The Match) అవార్డులు అందుకున్నాడు.
Shai Hope : భారత గడ్డపై శతకాలతో హోరెత్తిస్తున్న షాహ్ హోప్ (Shai Hope) ఉప్పల్ టీ20ల్లోనూ విరుచుకుపడ్డాడు. వన్డేల్లోనే కాదు పొట్టి క్రికెట్లోనూ ఉతికేస్తున్న వెస్టిండీస్ కెప్టెన్ మూడు ‘మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'(Player Of The Match) అవార్డు అందుకున్నాడు. ఒక పర్యటనలో ఇన్నేసి పీఓటీలు గెలవడం మామూలు విషయం కాదు. టీమిండియా పాలిట విలన్లా మారిన హోప్ ఇప్పుడు ఈ అవార్డులను అందుకునే సమయంలో గర్వపడినా.. ఇప్పుడు మాత్రం ‘అమ్మో.. ఇన్ని ఎలా తీసుకెళ్లాలి?’ అనేది తలచుకొని తలపట్టుకుంటున్నాడు.
వన్డే సిరీస్‌లో విధ్వంసక ఆటతో భారత్‌ను భయపెట్టిన షాయ్ హోప్ టీ20ల్లోనూ తడాఖా చూపించాడు. నాలుగు మ్యాచుల్లో రెండు సెంచరీలతో విండీస్ విజయంలో కీలకమయ్యాడతడు. ఉప్పల్ స్టేడియంలో భారత బౌలర్లను బెంబేలెత్తిస్తూ మెరుపు శతకం బాదిన హోప్.. ఈ పర్యటనలో మూడోసారి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. పటిష్టమైన టీమిండియాపై మ్యాచ్ విన్నర్‌గా ఇన్నేసి పీఓటీలు గెలవడం ఏ క్రికెటర్‌కైనా గర్వపడే విషయం. కరీబియన్ టీమ్ కెప్టెన్ సైతం అందుకు చాలా సంతోష పడుతున్నాడు. అదే సమయంలో ‘అయ్యో.. ఇన్నేసి అవార్డులను ఎలా తీసుకెళ్లాలి? స్వదేశం వెళ్లే సమయంలో లగేజీ సమస్యలు తప్పవు’ అని సరదాగా జోక్ చేశాడు హోప్.
Shai Hope is going back home with a lot of extra luggage 😂 https://t.co/qG92O9vBiR
— Cricinfo (@cricinfo) October 15, 2026
‘నిజాయితీగా చెబుతున్నా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు కాస్త బరువున్నాయి. స్వదేశం వెళ్లేటప్పుడు మేము లగేజీ బరువు చూసుకోవాల్సి ఉంది. ఈసారి విమానాశ్రయంలో చెకింగ్ సమయంలో ఈ పీఓటీల బరువు కారణంగా మాకు లగేజీ పరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశముంది’ అని హోప్ జోక్ చేశాడు. భారత పర్యటనలో ఇదివరకు మరే విండీస్ సారథిగా సాధ్యపడని విధంగా సుడిగాలి ఇన్నింగ్స్‌లు ఆడుతున్న హోప్… వరసగా రెండు వన్డేల్లో సెంచరీలు కొట్టాడు.
త్రివేండ్రంలో విఫలమైన అతడు గువాహటిలో 104, న్యూ ఛండీగఢ్‌లో 162 నాటౌట్‌తో టీమిండియా బౌలర్ల భరతం పట్టాడు. ఫార్మాట్ మారినా తన ఆటలో మార్పు లేదంటూ టీ20 సిరీస్‌లోనూ రెండు శతకాలతో వారెవ్వా అనిపించాడీ హిట్టర్. రాంచీలో 102 నాటౌట్, హైదరాబాద్‌లో 102 నాటౌట్‌తో విండీస్ విజయంలో కీలకమైన హోప్ సిరీస్ విజేతను నిర్ణయించే చివరి మ్యాచ్‌లోనూ చెలరేగాలనే పట్టుదలతో ఉన్నాడు.
Shai Hope, what have you been eating in India?
He’s having a sensational tour 🔥 https://t.co/sxFSWsnriP
— Cricinfo (@cricinfo) October 15, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shai Hope | వరసగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు.. ‘అమ్మో.. ఇన్ని ఎలా?’ అని తలపట్టుకున్న విండీస్ కెప్టెన్..!
Actor Brahmaji | ప్రజా ఉద్యమాలపై బ్రహ్మాజీ సెటైరికల్ పోస్ట్.. ట్రోలింగ్ తర్వాత క్లారిటీ!
Marri Janardhan Reddy | ఎన్హెచ్ఎం ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి : మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
Endometriosis | ఎండోమెట్రియోసిస్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి..
Bharateeyudu 3 | ‘భారతీయుడు 3’ వర్సెస్ ‘స్పిరిట్’, ‘వారణాసి’.. ఈ బాక్సాఫీస్ పోరులో శంకర్ నిర్ణయం ఏంటి?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

