Hero Rajinikanth – SRH | హైదరాబాద్ ఫ్రాంచైజీ మంచి ఆటగాళ్లను ఎంచుకోవాలి.. కావ్యను దిగాలుగా చూసి బాధేసింది : రజనీకాంత్
Hero Rajinikanth - SRH : తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth) ఐపీఎల్ 16వ సీజన్లో దారుణంగా విఫలమైన సన్‌రైజర్స్ హైదరాబాద్(SunRisers Hyderabad)జట్టుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హైదరాబాద్ జట్టు మంచి ఆటగాళ్లను ఎంచుకోవాలని యాజమాన్యానికి సూచించాడు. 'ఇండియన్ ప్రీమియర్ లీగ్ సమయంలో కళానిధి మారన్(Kalanithi Maran) కూతురు కావ్య మారన్(Kaviya Maran) టీవీలో దిగాలుగా కనిపించడం చూసి...
Hero Rajinikanth – SRH : తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth) ఐపీఎల్ 16వ సీజన్లో దారుణంగా విఫలమైన సన్‌రైజర్స్ హైదరాబాద్(SunRisers Hyderabad)జట్టుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హైదరాబాద్ జట్టు మంచి ఆటగాళ్లను ఎంచుకోవాలని యాజమాన్యానికి సూచించాడు. ‘ఇండియన్ ప్రీమియర్ లీగ్ సమయంలో కళానిధి మారన్(Kalanithi Maran) కూతురు కావ్య మారన్(Kaviya Maran) టీవీలో దిగాలుగా కనిపించడం చూసి బాధగా అనిపించింది. అందుకని ఈసారైనా మంచి ఆటగాళ్లను తీసుకోండి’ అని రజనీకాంత్ తెలిపాడు.
డేవిడ్ వార్నర్(Davdi Warner) సారథ్యంలోని ఎస్ఆర్హెచ్ 2016లో చాంపియన్‌గా అవతరించింది. ఆ తర్వాత కనీసం ఫైనల్‌కు చేరలేకపోయింది. గత రెండు సీజన్లలో ఆ జట్టు ఆట దారుణంగా ఉంది. ఈ ఏడాది పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. 2021లో, 2022లో వరుసగా 8వ స్థానంతో సరిపెట్టుకుంది. 16వ సీజన్‌కు యాజమాన్యం మంచి జట్టునే తీసుకుంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు

స్టార్లు ఉన్నా ఆట సున్నా..
వేలంలో ఇంగ్లండ్ స్టార్ హ్యారీ బ్రూక్(Harry Brook) కోసం ఏకంగా రూ.13.25 కోట్లు పెట్టింది. మయాంక్ అగర్వాల్(Mayank Agarwal)ను రూ.8.5 కోట్లకు కొన్నది. హెడ్‌కోచ్‌గా వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా(Brian Lara)ను తీసుకుంది. బౌలింగ్ కోచ్‌గా డేల్ స్టెయిన్, స్పిన్ కోచ్‌గా ముత్తయ్య మురళీధరన్.. ఇలా అందరూ స్టార్లు ఉన్నా కూడా ఆరెంజ్ ఆర్మీ రాత మారలేదు.
హెన్రిచ్ క్లాసెన్

సీజన్ ఆసాంతం వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్(Henrich Classen) ఒక్కడే నిలకడగా రాణించాడు. రాహుల్ త్రిపాఠి, కెప్టెన్ ఎయిడెన్ మరక్రం సహా అంతా విఫలమయ్యారు. ముఖ్యంగా ఓపెనింగ్ జోడీ సమస్య ఎస్ఆర్హెచ్ను తీవ్రంగా వేధించింది. అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్‌ను ప్రయత్నించింది. ఎవరూ కూడా నిలకడగా రాణించకపోవడం హైదరాబాద్ అవకాశాల్ని దెబ్బతీసింది.
ఇవి కూడా చదవండి
IND vs WI | రెండో వన్డేకు వర్షం అంతరాయం.. సగం వికెట్లు కోల్పోయిన టీమిండియా
Curtly Ambrose | సిక్స్‌లు బాదకుంటేనేం.. కోహ్లీ ఆట కనులవిందుగా అనిపిస్తుంది : విండీస్ దిగ్గజం
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

