Haris Rauf: కాళ్లకు ప్యాడ్స్ లేకుండానే క్రీజులోకి వచ్చిన హరీస్ రౌఫ్.. వీడియో వైరల్
Haris Rauf: హరీస్.. శనివారం లావింగ్టన్ స్పోర్ట్స్ ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కాళ్లకు ప్యాడ్స్, తలకు హెల్మెట్, చేతులకు గ్లవ్స్ లేకుండానే క్రీజులోకి వచ్చాడు. అయితే అంపైర్ అందుకు అంగీకరించలేదు.
Haris Rauf: పాకిస్తాన్ స్టార్ బౌలర్ హరీస్ రౌఫ్ మరోసారి వార్తలలో నిలిచాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్)లో మెల్బోర్న్ స్టార్స్ తరఫున ఆడుతున్న హరీస్.. శనివారం లావింగ్టన్ స్పోర్ట్స్ ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కాళ్లకు ప్యాడ్స్, తలకు హెల్మెట్, చేతులకు గ్లవ్స్ లేకుండానే క్రీజులోకి వచ్చాడు. అయితే అంపైర్ అందుకు అంగీకరించలేదు. కాళ్లకు ప్యాడ్స్ లేకుండా నాన్ స్ట్రయికర్ ఎండ్‌లో ఉన్న హరీస్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
వివరాల్లోకెళ్తే.. బిగ్‌బాష్ లీగ్‌లో సందర్భంగా మెల్బోర్న్ స్టార్స్ – సిడ్నీ థండర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో హరీస్ రౌఫ్ ఆఖరి ఓవర్లో చివరి బంతికి బ్యాటింగ్‌కు రావాల్సి వచ్చింది. డేనియల్ సామ్స్ వేసిన 19వ ఓవర్లో ఐదో బంతికి స్టెకెటె ఔటయ్యాక హరీస్ రౌఫ్ ఆఖరి బ్యాటర్‌గా వచ్చాడు. ఎలాగూ తాను బ్యాటింగ్ చేయబోయేది లేదు గనక ఇంతమాత్రానికి ప్యాడ్స్, గ్లవ్స్, హెల్మెట్ ఎందుకని అనుకున్నాడో గానీ ఖాళీ బ్యాట్ పట్టుకుని గ్రౌండ్లోకి అడుగుపెట్టాడు. అయితే దీనికి ఫీల్డ్ అంపైర్ అనుమతించలేదు. బ్యాటర్‌కు కనీస రక్షణ అవసరమని అభ్యంతరం వ్యక్తం చేయడంతో హరీస్ ఎట్టకేలకు గ్లవ్స్, హెల్మెట్ తెచ్చుకుని ఆదరాబాదరాగా నాన్ స్ట్రయికర్ ఎండ్‌లో నిలబడ్డాడు. అంపైర్ల బలవంతం మీద తలకు హెల్మెట్ పెట్టుకున్నా గ్లవ్స్ మాత్రం ధరించలేదు. కాళ్లకు ప్యాడ్స్ గురించి అంపైర్ కూడా పెద్దగా పట్టించుకోలేదు.
No gloves, pads or helmet on 🤣
Haris Rauf was caught by surprise at the end of the Stars innings!@KFCAustralia #BucketMoment #BBL13 pic.twitter.com/ZR9DeP8YhW
— KFC Big Bash League (@BBL) December 23, 2023
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన మెల్బోర్న్ స్టార్స్ నిర్ణీత 20 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌట్ అయింది. వెబ్‌స్టర్ (59), కెప్టెన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ (30)లు రాణించారు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన సిడ్నీ థండర్స్.. 18.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. అలెక్స్ హేల్స్ (26 బంతుల్లో 40, 3 ఫోర్లు, 3 సిక్సర్లు), కెమెరాన్ బాన్క్రాట్ (30), ఓలీవర్ డేవిస్ (22), డేనియల్ సామ్స్ (22)లు ధాటిగా ఆడి సిడ్నీకి విజయాన్ని అందించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

